దుబాయ్‌ జైల్లో నటుడి భార్య

0Amit-Tandon-wife-Ruby-in-Dubai-jailప్రముఖ హిందీ బుల్లితెర నటుడు అమిత్‌ టాండన్‌ మాజీ భార్య రూబీ.. దుబాయ్‌లోని అల్‌ రఫ్ఫా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అమిత్‌..రూబీని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. రెండు నెలల క్రితమే వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. రూబీ దిల్లీలో డెర్మటాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. జులైలో పని నిమిత్తం దుబాయ్‌ వెళ్లిన రూబి.. ఏదో విషయమై అక్కడి ప్రభుత్వ అధికారులను బెదిరించారు.

దాంతో దుబాయ్‌ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. విషయం తెలిసి రూబీని విడిపించడానికి అమిత్‌ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరికీ జియానా అనే పాప కూడా ఉంది. పాప సంరక్షణ కోసం తాను రూబీని విడిపించడానికి యత్నిస్తున్నానని అమిత్‌ మీడియా ద్వారా తెలిపారు