చిరు ‘సైరా’..సంగీత దర్శకుడు ఇతడే..!

0



మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా-నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. చిరంజీవి నయనతార జగపతిబాబు సహా ప్రధాన నటులంతా ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. సైరా చిత్రానికి సంబంధించిన నిర్ణయాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం విషయంలో యూనిట్ ఆచీతూచీ అడుగులు వేస్తోంది. హీరోయిన్ల విషయంలోనూ చాలామంది పేర్లు వినపడ్డాక చివరకు నయనతారను ఎంపిక చేశారు.

సైరాకు సంగీత దర్శకుడి విషయంలోనూ సందిగ్ధత వీడింది. మొదట ఏఆర్ రెహమాన్ ను ఈ సినిమాకు తీసుకున్నారు. కానీ రెహమాన్ అనుకోని కారణాలు డేట్స్ క్లాష్ కారణంగా సైరా నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత కీరవాణి పేరు కూడా వినిపించింది. అనంతరం సైరా ఫస్ట్ లుక్ కు తమన్ చేత బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఇప్పించారు. కానీ ఇప్పటికీ సంగీత దర్శకుడి పేరును అనౌన్స్ చేయలేదు.

తాజాగా సైరా చిత్రానికి సంగీత దర్శకుడిగా బాలీవుడ్ సంగీత సంచలనం అమిత్ త్రివేది పేరు ఫైనల్ అయినట్టు టాలీవుడ్ సమాచారం. ఇప్పటికే అమిత్ సైరా కోసం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను మొదలు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఈ మధ్యే పాటలు కూడా కంపోజ్ చేస్తున్నాడని తెలిసింది. మెగాస్టార్ బర్త్ డే ఆగస్టు 22న సైరా టీజర్ విడుదల చేయడానికి చిత్రం యూనిట్ ప్లాన్ చేసింది. ఇందుకోసం అమిత్ ట్యూన్లు రెడీ చేస్తున్నట్టు సమాచారం.

తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రాంచరణ్ నిర్మిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.