సైరా: బిగ్ బి రాజగురువు లుక్

0

ఇండియాస్ బెస్ట్ హిస్టారికల్ మూవీ తీయాలన్న పంతంతో ఉన్నాడు రామ్ చరణ్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై మోస్ట్ అవైటెడ్ మూవీని అందించాలన్న పట్టుదల – కసితో అతడు చేస్తున్న ప్రయత్నం `సైరా-నరసింహారెడ్డి`. ఈ సినిమా డాడ్ కి అమ్మ కానుకనివ్వాలని కలగన్నారు. అందుకే ఎక్కడా రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నామని తెలిపారు. ఆ కసి ప్రతి అడుగులోనూ కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ – టీజర్ లో అది కనిపించింది. సమ్మర్ రేస్ లో రిలీజ్ ని ఖాయం చేశారు కాబట్టి అందుకు తగ్గట్టు ప్రణాళికా బద్ధంగా చిత్రీకరణ సాగిస్తున్నారు.

జార్జియాలో ప్రీప్లాన్డ్ సెటప్ మధ్య భారీ వార్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. సైమల్టేనియస్ గా నిర్మాణానంతర పనుల్ని కానిచ్చేస్తున్నారు. ఇక జనవరి నుంచి పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమాల్ని హెరెత్తించేందుకు కొణిదెల ప్రొడక్షన్స్ ప్రణాళికలు వేస్తోందని తెలుస్తోంది. ఈలోగానే ఈ సినిమాలోని పాత్రల్ని పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్లతోనూ సందడి చేయనున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న ఆర్టిస్టుల బర్త్ డేలకు మోషన్ పోస్టర్లను రిలీజ్ చేయడం ద్వారా ప్రచారాన్ని పరుగులు పెట్టించనున్నారు.

ఇదివరకూ టీజర్ లో మెగాస్టార్- నరసింహారెడ్డి లుక్ కి అద్భుత స్పందన వచ్చింది. చిరు ఉగ్ర నరసింహాన్ని తలపించాడన్న ప్రశంస దక్కింది. తాజాగా సైరా నుంచి మరో మెగాస్టార్ లుక్ బయటకు వచ్చింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో రాజగురువుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు తన బర్త్ డే సందర్భంగా అమితాబ్ లుక్ ని లాంచ్ చేసి కానుకను ఇచ్చింది కొణిదెల టీమ్. గుబురు గడ్డం.. ఒత్తుగా ఎదిగిన మీసకట్టు – పాత్రకు తగ్గట్టే ఆ తలకట్టు .. వెనక్కి దువ్విన గిరజాలు – నుదుటిన దిద్దిన తిలకం .. అమితాబ్ స్ఫురద్రూపం రాజగురువు అన్న పదానికే వన్నె తెచ్చింది. ఇక ఈ మోషన్ పోస్టర్ కి అమిత్ త్రివేది ఇచ్చిన సంగీతం ఎంతో ఇంప్రెస్సివ్ అనే చెప్పాలి. ఇటీవలే బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్`లో అమితాబ్ లుక్ ని రివీల్ చేశారు. వీరాధివీరుడైన ఆజాద్ గా ఆ ట్రైలర్ లో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి సైరాలోనూ అంతే ఇంప్రెస్సివ్ పాత్రతో మైమరిపించనున్నారు బిగ్ బి. సురేఖ కొణిదెల సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చరణ్ నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
Please Read Disclaimer