మెగాస్టార్ సర్కార్ 3 ఫస్ట్ లుక్

0amitabh-bachchan-sarkar-3-first-lookరామ్ గోపాల్ వర్మ రీసెంట్ టైమ్ లో వార్తల్లో బాగానే నానుతూ ఉన్నాడు. వంగవీటి మూవీ కోసం ఓ నెల్లాళ్లకు పైగా హంగామా చేసిన వర్మ.. ఇప్పుడు చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150పై విమర్శలు చేస్తూ హైలైట్ అవుతున్నాడు. అలాగే బాలీవుడ్ లో వర్మ తీస్తున్న ప్రెస్టీజియస్ మూవీ పనులు కూడా శరవేగంగా పూర్తయిపోతున్నాయి.

అమితాబ్ బచ్చన్ ప్రధానపాత్రలో రూపొందుతున్న సర్కార్ 3 ఫస్ట్ లుక్ ని రివీల్ చేశాడు వర్మ. మెడలో రుద్రాక్షలు ధరించి.. బ్లాక్ డ్రస్ వేసుకున్న అమితాబ్.. ఓ సాసర్ లో కాఫీ తాగుతూ ఈ పోస్టర్ లో కనిపిస్తారు. కళ్లజోడు లోంచే కంటి చూపుతో కంట్రోల్ చేస్తున్న బిగ్ బీ లుక్ చూస్తే.. బీభత్సంగా భయపెట్టేస్తున్నట్లు అనిపించక మానదు. ఐ పవర్ తోనే అంతా నియంత్రించడం ఏంటో బిగ్ బీ లుక్ చూస్తే అర్ధమవుతుంది. మరోసారి పవర్ ఫుల్ కేరక్టర్లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు అమితాబ్ సిద్ధమైపోతున్నారు.

సర్కార్ 3 ఫస్ట్ లుక్ తో పాటే రిలీజ్ డేట్ కూడా చెప్పేశాడు రామ్ గోపాల్ వర్మ. 17 మార్చ్ 2017న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్లోనే వర్మ చెప్పేశాడు. సర్కార్ సిరీస్ లో మొదటి రెండు ఫిలిమ్స్ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రేక్షకులకు బాగానే తెలుసు. ఇప్పుడు సర్కార్3 పై ఇంతకు మించి అంచనాలు ఉండడంలో ఆశ్చర్యం లేదు. సర్కార్ 3తో బాలీవుడ్ లో వర్మ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడనే అంచనాలున్నాయి.