బాలకృష్ణకు మెగాస్టార్ షాక్

0amitabh-bachchan-politicalనందమూరి బాలకృష్ణ-కృష్ణవంశీ కాంబినేషన్ లో అనుకున్న చిత్రం రైతు. అన్ని పరిస్థితులు బాగుంటే రైతు మూవీ బాలయ్య ల్యాండ్ మార్క్ 100వ చిత్రంగా తెరకెక్కాల్సి ఉంది. ఓకే అనుకుంటున్న టైంలోనే.. క్రిష్ చెప్పిన గౌతమిపుత్ర శాతకర్ణి కాన్సెప్ట్ కి మొగ్గిన బాలయ్య.. రైతును పక్కన పెట్టేశారు.

ఇలా పక్కన పెట్టడానికి కారణం.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ డేట్స్ అప్పుడు అందుబాటులో లేకపోవడం కూడా. అయితే.. ఆ తర్వాతైనా బాలయ్యతో రైతు ప్రారంభించడం ఖాయమని.. అమితాబ్ డేట్స్ ఇవ్వగానే మొదలుపెడతారని అంతా అనుకున్నారు. కృష్ణవంశీ కూడా ఇదే చెప్పాడు. కానీ ఇప్పటికీ ఈ తెలుగు ప్రాజెక్టుపై మెగాస్టార్ కరుణించలేదు. రైతులో ఆయన చేయాల్సింది అతిథి పాత్రే అయినా.. కొన్ని రోజుల కాల్షీట్స్ తో సరిపోయినా.. హిందీ ప్రాజెక్టుల్లో బిజీ అంటూ తప్పుకుంటున్నారు బిగ్ బీ.

ఇప్పుడు ఓ మలయాళ మూవీకి అమితాబ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. కృష్ణవంశీ బాలయ్యలకు షాక్ కొట్టించే విషయమే. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రాండమూఝం పేరుతో తెరకెక్కనున్న మలయాళ సినిమాకి అమితాబ్ ఓకే చెప్పేశారు. ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఇందులో బిగ్ బీ భీష్ముడి తరహా పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. మరి బాలయ్య సినిమాకి మెగాస్టార్ డేట్స్ ఎందుకు ఇవ్వడం లేదో!