కలెక్టర్ ఆమ్రపాలి వివాహ విందు

0వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి, జమ్ముకశ్మీర్ ఐపీఎస్ అధికారి సమీర్ శర్మ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే,ఈనెల 18న జమ్మూకాశ్మీర్ లో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం హైదరాబాద్ చేరుకున్న కలెక్టర్ అమ్రపాలి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో వివాహ విందు ఏర్పాటు చేశారు.

ఈ విందుకు 600 మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ విందుకు హాజరయ్యేవారిలో జిల్లాలోని ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు వున్నారు. ఈ నెల 26 నుంచి మార్చ్ 7 వరకు నూతన దంపతులు టర్కీ వెళ్లనున్నారు.