కూతురి ఎంట్రీ-బికినీ పోజులపై షరతులు

0sara-alikhanతన కూతురు సారా అలీఖాన్ ను హీరోయిన్ గా పరిచయం చేయడానికి ఉత్సాహంగానే ఉన్నా.. ఆమె స్క్రీన్ లుక్ విషయంలో మాత్రం పలు పరిమితులు పెడుతోంది అమృతా సింగ్. ఇంకా సారాను తెరకు పరిచయం చేయకముందే.. ఒప్పంద పత్రాల మీద సంతకాలు కాకముందే.. అమృత పెడుతున్న షరతులు ఆసక్తికరంగా ఉన్నాయి. అవతల చాలా మంది హీరోయిన్లు దూసుకుపోతున్న రూటులో కూతురిని ప్రోత్సహించడం లేదు ఈ మాజీ హీరోయిన్.

ఈ రోజుల్లో హీరోయిన్లు బికినీలు వేయడం చాలా చాలా రొటీన్. కేవలం సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా బోలెడన్ని బికినీ పోజులను ఫొటోలుగా పోస్టు చేస్తున్నారు నటీమణులు. వయసుతో నిమిత్తం లేకుండా టీనేజ్ గర్ల్స్ దగ్గర నుంచి ఏజైన హీరోయిన్లు కూడా బికినీ స్టిల్స్ ఇచ్చేస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీల పిల్లలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

మరి బికినీ ఈ రోజుల్లో మరీ ఆలోచించాల్సిన విషయం ఏమీ కాకపోయినా… అమృతా సింగ్ మాత్రం తన కూతురి విషయంలో బికినీ ధారణకు షరతు పెడుతోందట. సారాను బికినీలో చూపడానికి వీల్లేదని ఈమె స్పష్టం చేస్తోందట. ప్రస్తుతం సారా అలీ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి చర్చలు జరుగుతున్న దశలో, కరణ్ జొహార్ సినిమాతో సారా తెరకు పరిచయం కానున్నదనే వార్తల నేఫథ్యంలో అమె షరతులు ఆసక్తికరంగా ఉన్నాయి.

పటౌడీ ల ఫ్యామిలీకి సంబంధించిన వారు హీరోయిన్లుగా కనిపించడం కొత్తేమీ కాదు. వీళ్లలో హాట్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న వాళ్లూ ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిల, సైఫ్ చెల్లెలు సొహా అలీఖాన్, సైఫ్ రెండో భార్య కరీనా కపూర్ లు బికినీల్లో మెరిసిన వాళ్లే. అలాగే అమృత కూడా హీరోయిన్ గా నటించింది. ఇలాంటి నేపథ్యంలో కూడా ఈమె కూతురు బికినీ పోజు విషయంలో నో చెబుతుండటం, షరతులు పెడుతుండటాన్ని బట్టి పటౌడీ ఫ్యామిలీ హీరోయిన్లలో కూతురిని ప్రత్యేకంగా నిలపాలని భావిస్తున్నట్టుందనుకోవాల్సి వస్తోంది.