వైరల్‌ అవుతున్న అమీ జాక్సన్ బికినీ ఫొటోలు

0వరుస చిత్రాల్లో నటిస్తున్న అమీ జాక్సన్ ప్రస్తుతం గ్రీక్‌లోని మైకోనోస్ దీవుల్లో విహార యాత్ర చేస్తున్నది. బిజీ బిజీ షెడ్యూళ్ల నడుమ కాస్త విరామం దొరకడంతో తన స్నేహితురాలితో కలిసి మైకోనోస్ దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నది. బికినీ దుస్తుల్లో హాట్‌ హాట్‌గా దిగిన తన ఫొటోలను ఇటీవల ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అమీ జాక్సన్ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

అందాల తార అమీ జాక్సన్ ప్రస్తుతం పలు భాషల్లో నటిస్తున్నది. ఇండో-ఆంగ్ల ప్రాజెక్ట్ బూగీ మ్యాన్ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. పలు చిత్రాల నటిస్తున్న అమీ జాక్సన్ ఇటీవల మైకోనోస్ దీవుల్లో తన స్నేహితురాలు జారా జోఫనీతో ప్రత్యక్షమైంది.

తన స్నేహితురాలు జారా జఫనీతో బికినీల్లో దిగిన ఫొటోలు హాట్‌హాట్‌గా ఉన్నాయి. అత్యంత శృంగారకరమైన భంగిమల్లో ఫొటోలకు ఫోజులిచ్చారు. వాటిని ‘బీచ్‌బమ్ బేబీస్’ టైటిల్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విహారయాత్రకు సంబంధించిన ఫొటోలను కూడా జారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అమీజాక్సన్ నటిస్తున్న చిత్రాల్లో బూగీ మ్యాన్, రోబో 2.0, ది విలన్ చిత్రాలు ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో 2.0 చిత్రంలో రజనీకాంత్ సరసన అమీ నటిస్తున్నది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో విలన్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రం జనవరి 25న విడుదలకు సిద్దమవుతున్నది.

అమీ జాక్సన్ ఓ కన్నడ చిత్రంలో కూడా నటిస్తున్నది. ది విలన్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో కిచ్చ సందీప్ హీరో. ఇప్పటి వరకు తెలుగు, హిందీ, తమిళ భాషలకే పరిమితమైన అమీ జాక్సన్‌ తొలిసారి కన్నడ చిత్రంలో అడుగుపెడుతున్నది.

amy-jackson-bikini-pics-1