బీచ్ లో బ్రిటీష్ సోయగం

0Amy Jackson enjoys in Beachఅందాల హీరోయిన్లందరూ ఖాళీ దొరికితే చాలు.. తమకంటే అందమైన లొకేషన్లలో సేద తీరుతున్నారు. సమంత ఇండోనేషియాలోని బాలి ఐల్యాండ్స్ కు వెళితే.. కాజల్ స్లోవేనియా వెళ్ళింది. హంసా నందిని గోవా వెళితే.. త్రిష అమెరికా వెళ్ళింది. ఇలా అందరూ అక్కడ కోలాహాలం సృష్టిస్తూ హాట్ అవుట్ ఫిట్స్ లోకి దిగిపోయి.. ఆ ఫోటోలతో మరింత రెచ్చిపోతున్నారు.

అలాగే సెక్సీ సోయగం ఆమీ జాక్సన్ కూడా.. తన మాతృదేశం అయిన ఇంగ్లండ్ వెళ్ళి అక్కడే సేద తీరుతోంది. కాని అమ్మడు తిరిగి ముంబయ్ రావాల్సి ఉండటంతో.. ఈలోపు మరో వేకేషన్ కు చెక్కేయాలని డిసైడైందట. వెంటనే ఫ్లయిట్ ఎక్కేసి మెక్సికో వెళిపోయింది. అక్కడ తులుం బీచ్లో అదిగో చూస్తున్నారుగా.. అలా హాట్ హాటుగా హంసనడకలు నడుస్తూ ఎంజాయ్ చేస్తోంది ఈ బ్రిటీష్ సోయగం.

ప్రస్తుతం తమిళంలో రోబో 2.0 సినిమా.. అలాగే బాలీవుడ్ లో మరో సినిమా తప్పిస్తే.. యామీ చేతిలో పెద్దగా ప్రాజెక్టులేవీ లేవు. కాని అమ్మడు మాత్రం రెగ్యులర్ గా ముంబయ్ లోనే ఉంటూ.. ఇక్కడే ఇతర మోడలింగ్ అండ్ ఫ్యాషన్ వాక్ పనులు చేసుకుంటూ.. చక్కగా సంపాదిస్తూ బాగా ఎంజాయ్ చేస్తోందిలే. అది సంగతి.