అమీ జాక్సన్‌ పెళ్లి కబురు ?

0amyహీరోయిన్ అమీ జాక్సన్‌ త్వరలో పెళ్లిపీటలెక్కబోతోందా ? అంటే అవుననే వినిపిస్తుంది. 2010లో వచ్చిన ‘మద్రాసపట్టణం’ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి వచ్చింది అమీ. ఆ తరువాత బాలీవుడ్‌లో వచ్చిన ‘ఏక్‌ దివానా థా’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో వచ్చిన ‘ఏ మాయ చేశావె’ సినిమాకు ఇది రీమేక్‌గా వచ్చింది. ఆ తరువాత ‘సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌’, ‘ఎవడు’, ‘ఐ’ తదితర చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం ఈ అమ్మడు బ్రిటన్‌కి చెందిన వ్యాపారవేత్త జార్జితో కొంతకాలంగా ప్రేమలో ఉందట . వ్యాలెంటైన్స్‌ డే రోజున అమీ..తన ప్రియుడికి విష్‌ చేస్తూ ఫొటో పోస్ట్‌ చేయడంతో ఆమె ప్రేమ విషయం అందరికీ తెలిసింది. అమీ స్వస్థలమైన బ్రిటన్‌ వెళ్లిన ప్రతీసారి తన ప్రియుడితోనే గడుపుతోందట. ఈ ఏడాదిలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రజనీకాంత్‌ తో ‘2.0’లో జంటగా కనిపిస్తుంది అమీ జాక్సన్‌. శంకర్ దర్శకత్వంలో ఆమెకి ఇది రెండో సినిమా. గతంలో వచ్చిన ఐలో కూడా అమీనే హీరోయిన్.