ఆమె చెప్పేది ధనుష్ గురించేనా?

0

పిచ్చోడికి పింగుమీద లోకువ అని ఒక పల్లెటూరి సామెత. మీరు ఇక్కడ ‘పింగు’ అంటే ఇంటర్నెట్ లో పింగ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆ పింగు వేరే. మీరే కనుక్కోండి. సరే ఇప్పుడు ఆ సామేత ఎందుకు వచ్చిందంటే.. మన సోషల్ మీడియాలో కానీ లేదా ‘కలర్’ మీడియాలో కానీ ఒక టాపిక్ దొరికిందంటే చాలు. ఇక వేరే న్యూస్ కనబడదు. ఇప్పుడు అంతా #మీటూ.

మరి కొంతమంది స్వయంగా ఆరోపణలు చేస్తున్నారు.. కొంతమంది పరోక్షంగా ఆరోపణలు చేస్తున్నారు. కొంతమంది అజ్ఞాతంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది పేర్లు బయటకు వచ్చాయి. #మీటూ లో భాగంగా హీరోయిన్ అమైరా దస్తూర్ మాట్లాడుతూ తనకూ బాలీవుడ్లో లైంగిక వేధింపులు ఎదురయ్యాయని తెలిపింది. సౌత్ లోకూడా ఒకప్రముఖ హీరో తనను ఇబ్బంది పెట్టాడని తెలిపింది. ఆ హీరో కు బాగా పలుకుబడి ఉందని కూడా చెప్పుకొచ్చింది.

అమైరా సౌత్ లో మూడు సినిమాలు చేసింది. రాజ్ తరుణ్ సినిమా ‘రాజు గాడు’.. సందీప్ కిషన్ ‘మనసుకు నచ్చింది’.. ధనుష్ సినిమా ‘అనేగన్'( తెలుగులో అనేకుడు). వీరిలో బాగా పలుకుబడి ఉన్న హీరో అంటే రజనికాంత్ అల్లుడుగారు ధనుష్. పైగా సుచీ లీక్స్ సమయంలో కూడా ధనుష్ పేరు జోరుగా వినిపించింది. మరి ఈ ‘రాజుగాడు’ హీరోయిన్ చెప్పిన ఆ పలుకుబడి గల్ల మారాజు ధనుషేనా లేదా ఏదైనా వేరే హీరో సినిమా నుండి ఈ వేధింపుల కారణంగా బయటకు వచ్చిందా?

అసలే జనాలు లెక్కకు మిక్కిలి సమస్యలతో సతమతమవుతుంటే ఈ అమైరా #మీటూ పజిల్ జనాల మీదకు వదిలింది. ఆ పేరేదో చెప్పేస్తే నెటిజనులు రెండు ఆర్మీలు గా తయారయ్యి.. హీరోను తిట్టేవాళ్ళు ఒకవైపు – అమైరాను తిట్టే వాళ్ళొక వైపు నిలబడి ఫైటింగ్ చేసుకుంటారు కదా. ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేసే ఓపిక ఎక్కడుంది జనాలకు?
Please Read Disclaimer