బికినీతో మత్తెక్కిస్తున్న భామ

0




ముంబై భామ అమైరా దస్తూర్ 16 ఏళ్లకే టీవీ కమర్షియల్స్ తో సత్తా చాటేసింది. బడా బ్రాండ్లకు యాడ్స్ చేసి బోలెడంత అనుభవం సంపాదించేసింది. 20 ఏళ్ల వయసులో సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీతో కెరీర్ ప్రారంభించాక.. ఇప్పుడు ఏ రేంజ్ లో చెలరేగిపోవాలి? సరిగ్గా అదే చేస్తోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.

సినిమాల విషయంలో ఆశించిన బ్రేక్ రాకపోవడంతో.. అమైరా దస్తూర్ అందరికీ అలవాటైన రూట్ లోకి వెళ్లిపోయింది. తాజాగా హైద్రాబాద్ పాస్ అనే మేగజైన్ కవర్ పేజ్ కనిపించిన ఈ 23 ఏళ్ల సుందరి.. ఒక్క చూపుతోనే మైకంలో ముంచెయ్యాలని వేసిన ప్లాన్ బాగానే వర్కవుట్ అయింది. ఒంటిపై కేవలం తెల్లని సింగిల్ పీస్ బికినీ వేసుకుని ఇచ్చిన పోజ్.. చూపరులను మత్తెక్కించేయడం ఖాయం. బికినీతో పోజులు చాలామందే ఇస్తారు కానీ.. అమైరా మాత్రం.. సైడ్ యాంగిల్ లోంచి చాలానే అందాలను కెమేరా ముందు పరిచేసి.. అభిమానులకు గిలిగింతలు పెట్టేసింది. వాలుగా వంచిన నడుం మాత్రమే కవర్ చేస్తున్నా.. అది కూడా సెక్సీగానే ఉంది.

ఇన్నేసి అందాలు ఉన్నా ఈ సుందరికి ఇంకా సినిమాల్లో బ్రేక్ మాత్రం రాలేదు. అనేకుడు అంటూ ధనుష్ కలిసి నటించినా.. జాకీచాన్ తో కుంగ్ ఫూ యోగాలో చేసినా కూడా ఒరిగిందేమీ లేదు. ప్రస్తుతం కమెడియన్ సంతానం హీరోగా నటిస్తున్న ఊడి ఊడి ఊజైకనుం అనే మూవీలో నటిస్తోంది అందాల బొమ్మ అమైరా దస్తూర్.Amyra-Dastur-for-Hyderabad-Paws-Magazine