క్యూట్ స్మైల్ కిల్లింగ్ లుక్స్

0

అందమైన అమ్మాయిలను చూస్తేనే తల తిప్పుకోవడం కష్టం.. ఇక వాళ్ళు బికినీల్లో కనిపిస్తే.. స్విమ్మింగ్ కు రెడీ అవుతుంటే.. ఎలాంటివారికైన కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది కదా. పాతికేళ్ళ ముంబై అమ్మడు అమైరా దస్తూర్ సరిగ్గా అలానే చేసింది. ఎంతకీ ఈమె ఎవరు అని ఆడిగితే రెండు మూడు హిందీ సినిమాల్లో నటించింది. ‘రాజుగాడు’.. ‘మనసుకు నచ్చింది’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

అందరూ హాట్ బ్యూటీల లాగానే ఈ అమైరాకూ ఇన్స్టాగ్రామ్ ఇష్టం. అందులో తన హాటు ఫోటోలు పోస్ట్ చేయడం అంటే మరింతగా ఇష్టం. రీసెంట్ గా ఒక స్మిమ్మింగ్ పూల్ మెట్లపై నిలబడి ఓ ఘాటు పోజిచ్చింది. వేసుకుంది బికినీయేగానీ ఇంకా పూర్తిగా స్విమ్ సూట్ లోకి మారలేదు. అసలు అమైరా నవ్వు కనుక చూస్తే డోనాల్డ్ ట్రంప్ కూడా వీసా నిబంధనలు ఇండియన్ మాడల్స్ కోసం మాత్రం సడలించమని ఇమ్మిగ్రేషన్ అధికారులకు ప్రత్యేక సూచన చేస్తాడేమో. ఏమో ఎవరికి తెలుసు అసలే అయన ట్రాక్ రికార్డు వెరీ హాటు. ఐటీ వాళ్ళ మీదే అయిన ప్రతాపం అంతా. అమైరా లాంటి బ్యూటీఫుల్ యంగ్ లేడీస్ ని చూస్తే ప్రేమ తన్నుకొస్తుంది. సరే ఇవన్నీ ఊరికే ఉబుసుపోక చెప్పుకునే కబుర్లే.

ఇంతకీ ఈ అమైరా ఫోటో ఎందులోది అంటే తన తాజా వెబ్ సీరీస్ ‘ది ట్రిప్ 2’ మొదటి ఎపిసోడ్ లోనిది. ఈ వెబ్ సీరీస్ లో అమైరా ఒక జిప్సీ వనిత పాత్ర పోషిస్తోందట. అంటే.. సొసైటీతో సంబంధం లేకుండా తనకు నచ్చినట్టు ప్రయాణం చేస్తుండడమే. ఈ వెబ్ సీరీస్ ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. వీలుంటే చూసి జన్మ ధన్యం చేసుకోండి.