ఒకటి కళ రెండోది చంద్రకళ

0

దర్శకుడు ఎన్. శంకర్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన టి. ప్రతాప్ దర్శకుడిగా ‘అనగనగా ఒక ప్రేమకథ’ అనే టైటిల్ తో ఒక లవ్ స్టొరీ తెరకెక్కింది. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్.కె . వెంకటేష్ మేనల్లుడు విరాజ్ జె అశ్విన్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. రిద్ధి కుమార్(లవర్స్ ఫేమ్).. రాధా బంగారు ఈ సినిమాలో హీరోయిన్లు. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది.

రెగ్యులర్ డెబ్యూ హీరో సినిమాల స్టైల్లోనే ఈ ‘అనగనగా ప్రేమ కథ కూడా ఉంది. అల్లరిచిల్లరగా అమ్మాయిల వెనక తిరిగే అబ్బాయి. ఓ అమ్మాయి ఆ అబ్బాయి మీద మనసు పారేసుకుంటుంది. మొదట్లో హీరోకు తెలియక పోయినా తర్వాత ఆ విషయాన్ని హీరో తెలుసుకుంటాడు. ఇక అప్పటికే ప్రాబ్లెమ్స్ స్టార్ట్. ఇక ఆ అమ్మాయి ప్రేమకోసం హీరో ఎంత దూరం వెళ్ళాడు అన్నది కథ. ఇక హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది హీరోనే ఇలా చెప్తాడు.. ‘మనకు నచ్చినవి రెండే రెండు.. ఒకటి కళ.. రెండోది చంద్రకళ’. కళ అంటే ఆర్ట్.. పెయింటింగ్. చంద్రకళ అంటే అమ్మాయిలట.

సినిమాను వైజాగ్ తో పాటుగా మలేషియా లాంటి ఫారెన్ లోకేషన్స్ లో చిత్రీకరించడంతో విజువల్స్ బాగానే ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ డోస్ కూడా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్.. అంజన్ కుమార్ సంగీతం అన్నీ ఓకే. కాకపోతే ఈ జెనరేషన్ ప్రేక్షకలు కోరుకునే కొత్తదనం మాత్రం కనబడడం లేదు. దర్శకుడు ప్రతాప్ పక్కా కమర్షియల్ మీటర్లో లెక్కలేసుకుని ఈ సినిమాను తెరకెక్కించినట్టుగా అనిపిస్తోంది. ఇంకెందుకు అలస్యం .. అమ్మాయిలకోసం జాగింగ్ కు వెళ్ళే హీరోను మీరూ చూడండి.
Please Read Disclaimer