అనసూయ రష్మి డ్యాన్స్ అదరగొట్టేశారు

0జబర్దస్త్ కామెడీ షోతో సూపర్ పాపులారిటీ సంపాదించిన యాంకర్లు అనసూయ భరద్వాజ్.. రష్మి గౌతమ్. ముందు అనసూయ ఇందులో పేరు సంపాదిస్తే.. ఆ తర్వాత ఆమె స్థానంలోకి రష్మి వచ్చింది. ఆపై ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ రెండో షో రావడంతో రెంటికి ఇద్దరూ యాంకర్లయ్యారు. అందరూ వీళ్ల మధ్య పోటీ ఉంటుందని.. ఇగో క్లాషెస్ ఉంటాయని అనుకునేవాళ్లు కానీ.. అలాంటిదేమీ లేదని.. వీళ్లిద్దరూ మంచి స్నేహితులని తర్వాత అనేక సందర్భాల్లో రుజువైంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అయిన ఈ భామలిద్దరూ అప్పుడప్పుడూ కలిసి ఈవెంట్లలో పాల్గొంటుంటారు. సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తుంటారు. తాజాగా అలాంటి వీడియోతోనే ఈ జోడీ హంగామా చేసింది.

బాలీవుడ్ ఆల్ టైం సూపర్ హిట్ పాటల్లో ఒకటైన ‘బాబూజీ జరా ధీరే చలో బిజ్లి కడి యహా బిజ్లి కడీ’ పాటకు అనసూయ.. రష్మి కలిసి డ్యాన్స్ చేశారు. ఎక్కడ ఏంటి అన్న వివరాలు తెలియవు కానీ.. వీళ్లిద్దరూ లో లైటింగ్ లో ఫుల్ సౌండు పెట్టుకుని క్యాజువల్ డ్రెస్సులో చేసిన డ్యాన్స్ భలేగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరూ కూడా డ్యాన్స్ ఇరగదీసేవాళ్లే. ప్రతివారం ‘జబర్దస్త్’.. ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ ఇంట్రడక్షన్లలో వీళ్ల డ్యాన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంటుంది. అదే ఊపును ఇక్కడా చూపిస్తూ డ్యాన్స్ అదరగొట్టేశారు. వీళ్లిద్దరూ ఈ కామెడీ షోతో పాటు సినిమాల్లోనూ సత్తా చాటుకుంటున్న సంగతి తెలిసిందే.