డబ్బింగ్ ఆర్టిస్టుగా మారిన హాట్ యాంకర్

0anasuya-farm-house-dreamపవన్ కళ్యాణ్ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తే నాకేమొస్తుంది అనుకుంది. చివరకు సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో అప్పటికే బుల్లితెరపై ఆరబోసిన గ్లామర్ అంతా దారబోసింది. అయినా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. చివరకు ఒక హిట్టు సినిమాలో మంచి రోలే చేసినా.. ఇండస్ర్టీలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఆ తరువాత ఐటెం సాంగే చేసినా కూడా.. ఎందుకో జనాలు అనసూయ అనసూయా అంటూ కలవరించట్లేదు.

మ్యాటర్ ఏంటంటే.. ఎంత గ్లామరసం దారబోసినా కూడా ఇప్పుడు సెక్సీ యాంకర్ అనసూయకు వెండితెర ఛాన్సులు మాత్రం పెద్దగా రావట్లేదు. బుల్లితెర మీద తన మాటలతో తన గ్లామర్ తో అమ్మడు తెగ ఆకట్టుకుంది కాని.. ఆ తరువాత వెండితెరపై మాత్రం తన సత్తా చాటడంలో విఫలమైంది. అందమైన రోల్స్ చేయడానికి రెడీ అని చెప్పినా కూడా ఎందుకో పెద్దగా బ్రేక్ రాలేదు. ఇప్పుడు చివరకు ”కేశవ” సినిమాకు ఆమె డబ్బింగ్ చెప్పింది. అవును.. అక్కడ ఇషా కొప్పికర్ రోల్ లో కనిపించేది ఇషా కాని.. గొంతిచ్చింది మాత్రం అనసూయ. ఆమె వాయిస్ కారణంగా ఆ పాత్రకు నిండుదనం వచ్చింది. కాని లాభం ఏముంది.. అదే రోల్ అనసూయకు కూడా ఇచ్చుండచ్చు.. కాని ఇవ్వలేదోచ్.

అలా చూస్తుంటే.. అనసూయ వాయిస్ లో బేస్ బాగుంది కాబట్టి.. బేబీకో బేస్ పసంద్ హై అంటూ మనోళ్ళు నిధానంగా ఆమెను డబ్బింగ్ ఆర్టిస్టును చేసేసినా చేసేయొచ్చు మరి.