లెజెండ్ కోసం అన‌సూయ‌

0legand1అన‌సూయ టాలీవుడ్‌ లోనే హాట్ యాంక‌ర్‌. ఆమె వ్యాఖ్యానం కంటే.. డ్ర‌స్సింగ్ సెన్స్‌కి ఫ్యాన్స్ ఉన్నారు. అన‌సూయ స్టేజ్ ఎక్కితే, క‌ళ్ల‌న్నీ అక్క‌డే! ఈమ‌ధ్య దుబాయ్‌లో బాల‌కృష్ణ‌తో చిందులేసిన అన‌సూయ‌.. మ‌రోసారి బాల‌య్య ప‌క్క‌న క‌న‌ప‌డ‌నుంది. ఎందుకంటే.. లెజెండ్ ఆడియో వేడుక‌కు యాంకరింగ్ చేసే అవ‌కాశం ఈ హాట్ భామ‌కే ద‌క్కింది. శుక్ర‌వారం హైద‌రాబాద్‌ లోని శిల్పక‌ళావేదిక‌లో లెజెండ్ పాట‌ల్ని ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ వేడుక‌కు అన‌సూయ యాంక‌రింగ్ చేయ‌నుంది. శ్రీ‌నువైట్ల‌, రాజ‌మౌళి, సురేంద‌ర్‌రెడ్డి, హ‌రీష్ శంక‌ర్‌, వినాయ‌క్‌, ఇలా టాలీవుడ్‌లో పేరున్న ద‌ర్శ‌కులంతా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు. లెజెండ్ పాట‌లు, అన‌సూయ యాంక‌రింగ్‌, బాల‌య్య మాట‌లు… ఇంకేం కావాలి..?? లెజెండ్ ఆడియో ఇక అద‌ర‌హొనే..