‘రంగస్థలం’లో ఓ స్టిల్ ను పోస్ట్ చేసిన యాంకర్ అనసూయ!

0Anasuya-Leaks-Rangasthalam-‘నింద నిజమైతే తప్పక దిద్దుకో.. అబద్ధమైతే నవ్వేసి వూరుకో..’ అనే క్యాప్షన్ తో ‘రంగస్థలం 1985’ సినిమాకు సంబంధించిన ఓ ఫొటోను యాంకర్ అనసూయ విడుదల చేసింది..ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్న అనసూయ, తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఫొటోను పోస్ట్ చేసింది. కాళ్లకు గజ్జెలు, కాలి వేళ్లకు మెట్టెలతో కూర్చుని ఉన్న ఓ అమ్మాయి (ముఖం కనపడకుండా) ముందు ఓ కూజా ఉండటాన్ని ఈ ఫొటోలో గమనించవచ్చు. ఈ సినిమాలో అనసూయ పాత్రకు సంబంధించిన స్టిల్లే ఈ ఫొటో అని అభిమానులు భావిస్తున్నారు.

‘నింద నిజమైతే తప్పక దిద్దుకో.. అబద్ధమైతే నవ్వేసి వూరుకో..’ అనే డైలాగ్ ఈ చిత్రంలో ఆమె చెప్పేదా? లేక సొంత మాటలా? అనే విషయం ఈ సినిమా విడుదలయ్యాక గానీ తెలియదు. కాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రంగస్థలం 1985’. ఈ చిత్రం షూటింగ్ పనులు శరవేంగా జరుగుతున్నాయి. 2018 సంక్రాంతి పండగ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్టు సమాచారం.