అనసూయకి పిచ్చి కోపం వచ్చింది

0Anasuya-recently-got-angryసెలిబ్రిటీలపై తరుచుగా ఏవో ఒక కామెంట్లు వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రతివారి జీవితంలో భాగం కావడంతో ఈ కామెంట్లు జోరు మరింత పెరిగింది. సాధారణంగా హీరోలపై విమర్శలకన్నా హీరోయిన్ లపై విమర్శలు ఎక్కువగా వస్తాయి. టివి షో హోస్ట్ గా యాంకర్ అనసూయకు ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. ఒక టివి షో తోనే ఇంత పాపులర్ అవ్వటం ఇప్పుడు సినిమాలలో కూడా ఛాన్సులు రావడం కొంతమందికి నచ్చినట్లు లేదు. ఆమె సోషల్ మీడియా ఎకౌంట్ లో ఆమెపై ఆమె వేసుకుంటున్న డ్రెస్సులపై విమర్శలు చేస్తున్నారు.

అనసూయ పై ఒక వ్యక్తి ఏమని కామెంట్ చేశాడంటే.. ”అనసూయ నీకు ఏమైనా బుద్ది ఉందా.. నువ్వు ఏమి వేసుకుంటున్నావో నీకు తెలుస్తోందా? మేము మా ఫ్యామిలితో కలిసి ఆ షో చూడలేకపోతున్నాము” అని అన్నాడు. ఆమె వేసుకున్న ఒక సెక్సీ డ్రస్ ఫోటోపై ఇలా కామెంట్ చేశాడులే. దానికి అనసూయకు బాగా కోపం వచ్చినట్లు ఉంది. తీవ్ర స్థాయిలో రిప్లయ్ ఇచ్చింది. ”నీకు నీ విలువలు అంత అవసరం అనుకుంటే షో చూడకుండా ఉండు. మేము ఏమి వేసుకోవాలో ఎలా నడుచుకోవాలో నువ్వు నాకు చెప్పకూడదు. వేరే వారి పనిలో తలదూర్చకూడదు అనే కనీస మర్యాద తెలిసినట్లు లేదు నీకు. నేను ఒక పబ్లిక్ ఫిగర్ని కదా అని నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. నేను ఒక అమ్మను – ఆడదాన్ని పైగా ఇది నా వృత్తి” అని గట్టిగానే చెప్పింది.

అలా చెప్పి ఊరుకోలేదు అనసూయ ఇంకా వాడికి వివరణ ఇస్తూ ”ఇది నా పనిలో ఒక భాగం. అయినా ఏమి చూడకూడదు ఏమి చూడాలి అనేది నీ అదుపులో ఉండాలి. నువ్వు వద్దు అనుకున్నది నీకు ఎవరూ బలవంతంగా చూపించారు. నా పని ఎలా చేయాలో నాకు బాగా తెలుసు’ అని చెప్పింది. మన చుట్టూ చాలాసార్లు చిన్న పిల్లలపైన వయసు పైబడిన ఆడవాళ్ళపైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి వారిలో ఏమి చూసి వాళ్ళను హింసకు గురి చేస్తున్నారు??” అని ప్రశ్నించింది. నీ ఆలోచనలు ఏమైనా ఉంటే అవి నీ జీవితంలో పాటించు ఇలా అనవసరంగా పబ్లిక్ ప్లాట్ ఫామ్లో రచ్చ చేయవలిసిన పని లేదు అంటూ ముగించింది.