సాక్షి అనసూయ యాత్ర వరకూ వచ్చింది

0

నిన్న విడుదలైన యాత్ర పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఒక పార్టీ నేత ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కథే అయినప్పటికీ అందులో చూపించిన ఎమోషనల్ కంటెంట్ కి జనం బాగా కనెక్ట్ అవుతున్నారు. సాధారణ ప్రేక్షకులు సైతం వైఎస్ఆర్ పధకాల వెనుక నేపధ్యాన్ని తెలుసుకుని కంటతడి పెడుతున్న దృశ్యాలు నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే ఇందులో ఓపెనింగ్ సీన్ లో కొన్ని నిమిషాల పాటు కనిపించిన అనసూయకు మంచి ప్రశంశలు దక్కుతున్నాయి.

తెరమీద మమ్ముట్టి పరిచయమే తన ద్వారా జరుగుతుంది . ప్రత్యర్థి కూతురిగా ఇంటికి వచ్చి రోడ్డు మధ్య శత్రువులు చంపేందుకు కాపు కాస్తే రాజన్న బండిని చూపించి అక్కడి నుంచి దర్జాగా వెళ్ళిపోయే సన్నివేశం ఓ రేంజ్ లో పేలింది. అయితే అనసూయ ఇలా వైఎస్ ఆర్ కు సంబంధించిన సినిమాలో చేయడానికి సాక్షి మీడియాకు లింక్ ఉందనే ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే అనసూయ కెరీర్ మొదలుపెట్టింది సాక్షి ఛానల్ లో. యాంకర్ గా అందులో చాలా గుర్తింపు తెచ్చుకున్నాక వేరే ఛానల్స్ షిఫ్ట్ అయిపోయి ఎంటర్ టైన్మెంట్ బేస్డ్ షోలు చేసి తక్కువ టైంలో తారాస్థాయికి చేరిపోయింది.

మళ్ళి ఇన్నాళ్ళకు సాక్షి మీడియా ఆలోచనకు అంకురార్పణ చేసిన వైఎస్ ఆర్ పాదయాత్ర కథలో ఓ కీలక పాత్ర పోషించడం కాకతాళీయమే కావొచ్చు కాని ఇలా కలిసి రావడం అంటే విశేషమేగా. పైగా తన పాత్ర గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకోవడం కూడా అనసూయకు కిక్కిచ్చేదే. ఇప్పటికే గడపలోకి వచ్చిన ఆడకూతురితో రాజకీయమేంది అనే డైలాగ్ విపరీతంగా వైరల్ అయిపోయింది. పైరసీ తప్పని తెలిసినా అభిమానులు ఆత్రుత తట్టుకోలేక దీని వీడియో క్లిప్పింగ్ ఒక్కదాన్నే ఆన్ లైన్ లో షేర్ చేస్తున్నారు. మొత్తానికి అనసూయ చిన్నదే అయినా గట్టి పాత్రే కొట్టేసింది
Please Read Disclaimer