వైఎస్సార్ యాత్రలో అనసూయ

0టాలీవుడ్ లో ప్రస్తుతం యాంకర్ లు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా వారి సత్తా చాటుతున్నారు. మంచి అవకాశాలు వస్తే ఏ మాత్రం నో చెప్పకుండా వారి టాలెంట్ చూపిస్తున్నారు. ఇప్పుడు యాంకర్స్ మధ్య పోటీ చాలా పెరిగింది. అయితే వెండితెరపై మాత్రం జబర్దస్త్ యాంకర్ అనసూయా తన నటనతో అందరికి ఛాలెంజ్ విసురుతోంది. బడా సినిమాల్లో అవకాశాన్ని అందుకుంటూ తన క్రేజ్ ను కూడా పెంచుకుంటోంది రంగమ్మత్త.

సమ్మర్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో అనసూయ ఏ రేంజ్ లో మెప్పించిందో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే స్థాయిలో మెప్పించడానికి మళ్ళి రెడీ అవుతోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్రలో అమ్మడు కీలక పాత్రలో కనిపించనుందట. దర్శకుడు మహి వి రాఘవ క్యారెక్టర్స్ విషయంలో ఏ మాత్రం రాజీపడటం లేదని తెలుస్తోంది. వైఎస్సార్ పాత్రలో మమ్ముంటి నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే అనసూయను ఒక ముఖ్యమైన పాత్ర కోసం తీసుకున్నారట. కర్నూలు జిల్లాలోని ఒక పవర్ఫుల్ లేడి క్యారెక్టర్ లో ఆమె కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. ఇంకా ఈ విషయాన్ని అధికారికంగా చేప్పాల్సి ఉంది. ఇటీవల యుసుప్ గూడలో సినిమా షూటింగ్ ని ఎట్టకేలకు స్టార్ట్ చేశారు. విజయమ్మ పాత్రలో బాహుబలి ఫెమ్ ఆశ్రితా వేముగంటి నటించనుండగా మరికొన్ని పాత్రలకు నటీనటులను దర్శకుడు ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది.