యంగ్ హీరోతో అనసూయ డేటింగ్

0anasuya-stillహాట్ యాంకర్ అనసూయ బుల్లితెరతో పాటు వెండి తెరపై కూడా ఓ వెలుగు వెలుగుతోంది. జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించి టాప్ హీరోల సరసన చాన్స్ కొట్టేసిని ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో తన జోరును మరింత పెంచింది. యాంకర్‌గా తన హవాను చూపిస్తూనే పలు టివి చానల్స్ నిర్వహించే స్పెషల్ ప్రోగ్రామ్స్ లోనూ తలుక్కుమంటోంది.

ఈ మధ్య కాలంలో అనసూయని హైలైట్ చేస్తూ ఓ చానల్ వారు ‘ఏ డేట్ విత్ అనసూయ’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ ఈ వారం సెలబ్రిటీగా వస్తున్నారంటూ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో అనసూయ నవదీప్‌ని తనదైన శైలిలో కొన్ని ప్రశ్నలు అడిగింది. ‘మీకు మేం మూడు కాస్ట్యూమ్స్ ఇస్తాం.. సూపర్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మేన్ అందులో ఏది వేసుకుంటారో చెప్పాలంటూ క్వచ్చన్ వేయడం, దాని నవదీప్ బ్యాట్‌మేన్ డ్రెస్ వేసుకుంటా అనడంతో… అనసూయ చాలా నిరుత్సాహ పడుతూ మీరు సూపర్‌మ్యాన్ డ్రెస్ అంటారనుకున్నా అని, ఆ డ్రెస్ వేసుకుంటే నాకు టైం పాస్ అయినట్లు ఉంటుందని తెగ సిగ్గుపడిపోయింది.

దీనికి మన యంగ్ హీరో ఊరుకుంటాడా.. మీకు సూపర్‌మేన్ అండర్‌వేర్ చూడాలని ఆశ.. లేక నేను అండర్‌వేర్ వేసుకుంటే చూడాలని ఆశ అంటూ సెటైర్ వేశాడు. అంతటితో ఆగకుండా ఒకటే నవ్వులు, స్టెప్పులూ అబ్బో ప్రోమో మొత్తం ‘ఏ డేట్ విత్ అనసూయ’ ప్రోగ్రామ్‌కి తగ్గట్లే ఉంది. ప్రోమోనే ఇలా ఉంటే అసలు ప్రోగ్రామ్‌లో ఎంత హంగామా చేశారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.