బూతు టీవీ షోలు పై అనసూయ వివరణ!

0anasuya-about-jabardast-jacఇటీవల రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో చలపతి రావు కామెంట్స్ వివాదం సెగ…. బుల్లితెరపై బూతు షోలుగా ముద్ర పడిన కొన్ని కామెడీ షోలకు తాకిన సంగతి తెలిసిందే.

చలపతిరావు వివాదంపై చర్చించే క్రమంలో…. కొన్ని టీవీ షోల ప్రోమోలను ఉదాహరణగా చూపుతూ యాంకర్ అనసూయను, జబర్దస్త్ కామెడియన్ల ప్రవర్తనను, వారు ఆయా షోలలో ఉపయోగిస్తున్న బూతు కంటెంటుపై 30 ఇయర్స్ పృథ్వి, కవిత, హేమ లాంటి సినీ ప్రముఖులు ఎండగట్టారు.

తనపై, తాను హోస్ట్ చేస్తున్న షోలపై విమర్శలు రావడంతో యాంకర్ అనసూయ…..సోషల్ మీడియా వివరణ ఇచ్చారు. ఇంతకంటే హీనంగా చాలా చోట్ల ఉంటుంది… ప్రోమోల్లో కనిపించేదంతా నిజం కాదు, కేవలం ప్రేక్షకులు ఆ షో చూసేలా స్పైసీగా అలా ప్రోమోలు కట్ చేస్తారు అని అనసూయ అన్నారు.

అనసూయ హోస్ట్ చేస్తున్న జాక్ పాట్ ప్రోమోపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రోమోలో మీది లేస్తది, నాది పడిపోద్ది అంటూ షేకింగ్ శేషు…అనసూయతో అనడం విమర్శలకు దారి తీసింది. ఇది పచ్చి బూతులా ఉందని, బుల్లితెరపై ఇలాంటి చండాలం ఏమిటీ అంటూ పలువురు విమర్శించారు.

శేషు గారు జాక్ పాట్ షోకు వచ్చినపుడు ప్రమోలో ఉన్నదానికి,….జరిగిన దానికి సంబంధం లేదు. అక్కడ కనిపించేది అంతా అబద్దం. నేను కూడా ఆ కార్యక్రమం గురించి ఏమీ తెలియకుండా ప్రోమో చూస్తే వాట్ నాన్సెస్ అని అనుకుంటాను. ప్రోగ్రామ్ పూర్తిగా చూసిన వాళ్లికి లేవడం, పడి పోవడం అనేది ఏమిటి అని అర్థమైంది. అది జాక్ పాట్ డబ్బుల విషయం గురించి… అంతే తప్ప మరేమీ లేదని, బూతు అంతకంటే లేదని అనసూయ అన్నారు.

ఇలా పెడర్థాలు వచ్చేలా ప్రోమో వేయవద్దని, ఇది ప్రేక్షకులను మిస్ లీడింగ్ చేస్తుందని అప్పుడే నేను షో నిర్వాహకులకు చెప్పాను. హైపర్ ఆది వచ్చినపుడు కూడా ఇలానే పెడార్థాలు వచ్చేలా ప్రోమో కట్ చేసారు. ప్రస్తుతం ఎంటర్టెన్మెంట్ ఒక డిఫరెంట్ లెవల్ కి వెళ్లి పోయింది. నేను కూడా ఈ విషయంపై బ్యాడ్ గా ఫీలవుతున్నాను. కానీ ఇలాంటివి ఆపడం నా ఒక్కదాని చేతిలో లేదు అని అనసూయ అన్నారు.

సపరేట్‌గా స్టాండ్ ఔట్ అవ్వాలని డైరెక్టర్, ఎడిటింగ్ చేసే వాళ్లు, యాజమాన్యం అలాంటి ప్రోమోలు కట్ చేస్తున్నారు. మనం ట్రాక్ తప్పుతున్నామని చాలా సార్లు హెచ్చరించాను. కానీ వారు వినలేదు. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు నాకు గుణపాఠం లాంటివే అని అనసూయ అన్నారు.

గతంలో నేను కొన్ని షోలలో ఇంతకంటే పిచ్చిగా, సెన్స్ లేకుండా మాట్లాడి ఉంటాను. అందుకు నేను ఇపుడు సారీ చెబుతున్నాను. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకే ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చాను. ప్రతి విషయానికి మూడు యాంగిల్స్ ఉంటాయి. నేనేం అనుకుంటున్నాను, మీరేం అనుకుంటారు, అక్కడేం జరిగింది…. ఇదంతా మీరు అర్థం చేసకుంటారని అనుకుంటున్నాను అని అనసూయ అభిమానులకు వివరణ ఇచ్చారు.

నేను చేసే ప్రతి షో, వేసుకునే బట్టలు ఎవరికీ సంబంధం లేదు. నేను చేసే షోలు, నా బట్టలు అన్ని మీకు అందరికీ నచ్చాలని లేదు. నా డ్రెస్సింగ్ ప్రోగ్రాంకు తగిన విధంగా ఉంటాయి. కొన్ని సార్లు సాంప్రదాయంగా, కొన్నిసార్లు మోడ్రన్ గా ఉంటాయని అనసూయ తెలిపారు.

నేనే కామ్ గా ఉంటే సపోర్టు చేస్తాను అనుకుంటారని భయమేసింది. నాకు కూడా కొన్ని నచ్చవు, అప్పుడప్పుడు దీంట్లో కంటే హీనంగా చాలా చోట్ల ఉంటుంది. అక్కడ కనిపించవు, ఇక్కడ మేము కనిపిస్తాం. …. కానీ ప్రొఫెషన్లో భాగంగా కొన్ని చేయక తప్పడం లేదు అని అనసూయ అన్నారు.

ఎటర్టెన్మెంట్ పంచడంలో భాగంగా, మమ్మల్ని మేము డిస్కవర్ చేసుకునే క్రమంలో కొన్ని సార్లు శృతి తప్పుతాం. అవి సరిదిద్దు కుంటే మంచిది. సరి దిద్దుకోక పోతే తప్పే. అందుకే నేను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను అని అనసూయ తెలిపారు.

నేను ఆర్టిస్టుగా మాత్రమే మీకు తెలుసు… నేను బయట ఒకరికి కూతుర్ని, ఇద్దరు పిల్లలకు తల్లిని, ఒకరికి భార్యను, ఒకరికి కోడలిని, ఇద్దరు చెల్లెళ్లకు అక్కని….. నా లిమిట్స్ ఏమిటో నాకు తెలుసు అని అనసూయ అన్నారు.

నేను ఇండస్ట్రీలో ఇవన్నీ విమర్శలు విని గట్టిగా అయ్యాను. ఫ్యామిలీలో అందరూ అలాగే ఉండరు. హర్ట్ అవుతారు. టెలివిజన్లో ఎంటర్టెన్మెంట్ కోసం కొన్నిసార్లు కొంచెం హద్దు దాటిన మాట నిజమే. కానీ మళ్లీ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నామని అనసూయ అన్నారు.

తమపై విమర్శలు చేస్తున్న వారిపై అనసూయ మాట్లాడుతూ….. ఎవరి లైఫ్ గురించో మీకెందుకు. వాళ్ల మానాన వాళ్లు పోతారు. నచ్చక పోతే వదిలేయండి, మీకు ఇంతకంటే ముఖ్యమైన పనులు ఉంటాయి. ముందు వాటిపై ఫోకస్ పెట్టండి అని అసూయ హితవు పలికారు.