క్రిటిక్స్ పై అనసూయ సెటైర్

0anasuya-stillఅత్తారింటికి దారేది సినిమాలో ఐటెం సాంగ్ చేయనప్పుడు.. ఆ సినిమాలో ఆ సాంగ్ చేసుంటే నాకేం వచ్చేది అని ప్రశ్నించింది యాంకర్ అనసూయ. ఇప్పుడు కట్ చేస్తే విన్నర్ సినిమాలో చాలా హాటుగా ఒక సాంగులో మెరిసింది. కాని మ్యాటర్ ఏంటంటే.. కేవలం ఆ సాంగు లిరిక్ లో అనసూయ పేరు ఉందనే విషయం తప్పితే.. అసలు ఆ పాటకూ సినిమాకూ పెద్ద సంబంధమే లేదు. మ్యాటర్ ఉన్న రోల్స్ మాత్రమే టేకప్ చేస్తా అని చెప్పిన అనసూయ.. ఇలాంటి ఐటెంను చేయడం వలన పెద్దగా మూటకట్టుకుంది ఏమీ లేదు. అందుకే ఇప్పుడు చాలామంది ఆమె రెమ్యూనరేషన్ కోసం ఇలాంటి దారి ఎందుకు ఎంచుకుంది అంటూ సెటైర్ వేస్తున్నారు.

అయితే ఇప్పుడు అనసూయ ఇటువంటి క్రిటిసిజంపై తనదైన రీతిలో సెటైర్ వేసిందా అంటే అవుననే చెప్పాలి. ”నీకు నువ్వు సమాధానం చెప్పుకుంటే సరిపోతుంది. భూమ్మీద ఉన్న ప్రతీ ఒక్కరికీ సమాధానం చెప్పక్కర్లేదు” అంటూ తన సోషల్ మీడియా పేజీలో పేర్కొంది అనసూయ. దీని బట్టి చూస్తుంటే.. ఆ సాంగ్ వలన ఏమైనా ప్రయోజనం ఉందా లేదా.. లేదంటే ఆ పాటకు ఎందుకు నర్తించానో.. వంటి అంశాలపై అనసూయ కేవలం అనసూయకు మాత్రం ఆన్సర్ చెప్పుకుంటుంది కాని.. ఆ పాట ఎలా ఉన్నా ఎవ్వరికీ ఏమీ చెప్పదనమాట. సర్లేండి.. ఆమె కెరియర్ ఆమె ఇష్టం. అసలు బుల్లితెరపై ఆమె గ్లామర్ కు ఫిదా అయిపోయిన ఈ అభిమానులు ఇప్పుడు అదే గ్లామర్ వెండితెరపై చూపిస్తే ఆస్వాదించకుండా సెటైర్లు వేస్తారెందుకో అర్దం కాదు బాబా!!