మంచు కొండలను చుట్టేస్తున్న హాట్ యాంకర్

0

జబర్దస్త్ యాంకర్ అనసూయ పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. జబర్దస్త్ గ్లామర్ తో బుల్లి తెరపై మరియు వెండి తెరపై ఆకట్టుకుంటున్న అనసూయ ప్రస్తుతం సమ్మర్ హాలీడే ట్రిప్ కు వెళ్లింది. హైదరాబాద్ లో ఎండలు రికార్డులను బ్రేక్ చేస్తున్న నేపథ్యంలో పలువురు చల్లని ప్రదేశాలకు హాలీడే ట్రిప్ పేరుతో వెళ్తున్నారు. అలాగే అనసూయ కూడా ఫ్యామిలీతో కలిసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని గుల్ మార్గ్ ప్రాంతంలో సేద తీరుతోంది. అక్కడ మంచు కొండలను చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తోంది.

తాము జమ్ములోని గుల్ మార్గ్ లో ఉన్నట్లుగా అనసూయ వెళ్లడించి ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోపై ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ఒక చెట్టు వద్ద నిల్చుని దాని బెరడు తుంచి పేపరు పెన్ను లేని సమయంలో దీనిపై ఉత్తరాలు రాసుకునేవారట అంటూ చెప్పుకొచ్చింది. పేపర్ లేనప్పుడు బెరడు ఉపయోగించే వారు ఓకే మరి పెన్ను లేకుండా దేనితో రాశారమ్మా అంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు హాట్ యాంకర్ కూల్ అవుతోంది అక్కడ అంటూ కామెంట్స్ చేశారు.

ఇక తన పెద్ద కొడుకు బర్త్ డే సందర్బంగా ఒక ఎమోషనల్ పోస్ట్ ను అనసూయ చేసింది. కొడుకు ఫొటోను షేర్ చేసి.. నువ్వు నా కొడుకుగా జన్మించావు తద్వారా నేను మరోసారి తల్లిగా కొత్త జన్మనెత్తాను. నీపై నాకున్న ప్రేమ ఎప్పటికి తరగనిది. నువ్వు జీవితాంతం సంతోషంగా గడపాలనుకుంటున్నాను నా ఛాంపియన్ అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. ఒక వైపు బుల్లి తెర మరో వైపు వెండి తెరపై అనసూయ తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.
Please Read Disclaimer