అనసూయ అందానికి నో షార్ట్ కట్స్

0Anasuya-Reacts-On-Plastic-Surgeryతెలుగు యాంకర్లలో సుమ తర్వాత అంత పేరు తెచ్చుకుంది అనసూయే. సుమ తన మాటకారితనంతో అందరి మెప్పు పొందింది. యాంకర్ కు గ్లామర్ లుక్ తెచ్చింది మాత్రం అనసూయే. అందంతోపాటు అట్రాక్షన్ కూడా పుష్కలంగా ఉండటంతో టాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. క్షణం సినిమాలో ఓ నెగిటివ్ రోల్ చేసి తనలో యాక్టింగ్ టాలెంట్ కూడా ఉందని ప్రూవ్ చేసుకుంది.

తాజాగా అనసూయకు సంబంధించి టాలీవుడ్ లో ఓ రూమర్ గుప్పుమంటోంది. తన అందాలకు మెరుగులు దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే టాక్ నడుస్తోంది. తెరపై మరింత నాజూగ్గా కనిపించేందుకు ఈ పని చేసిందనే మాట వినిపిస్తోంది. ఈభామ కాస్తంత బొద్దుగా కనపించవచ్చేమో కానీ ఆమె అందానికొచ్చిన లోటయితే ఏమీ లేదు. ఆమెలో సెక్స్ అప్పీల్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా తెలుగు ప్రేక్షకులు ఆమెను అలాగే ఇష్టపడుతున్నారు. అలాంటప్పుడు బరువు తగ్గించుకోవడానికి సర్జరీ దాకా వెళ్లాల్సిన అవసరమే లేదు.

ఈ రూమర్లపై అనసూయ ఎట్టకేలకు పెదవి విప్పింది. ‘నాకు సంబంధించి ఏ న్యూస్ లేకపోయిేసరికి సర్జరీ అనే రూమర్ క్రియేట్ చేశారు. కచ్చితంగా చెబుతున్నా.. అలాంటిదయితే లేదు. నో.. నెవర్. షార్ట్ కట్స్ పైన నాకెలాంటి నమ్మకం లేదు’ అంటూ సోషల్ మీడియా ద్వారా తెగేసి చెప్పింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం 1985 సినిమాలో అనసూయ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ సినిమా తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని అనసూయ కాన్ఫిడెంట్ గా ఉంది.