అనుకోని అతిథిని చూసి యాంకర్‌ షాక్‌!

0ఓ ఛానల్‌ న్యూస్‌రూమ్‌లోకి అనుకోని అతిథి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాని.. ఆస్ట్రేలియాలోని ‘9 న్యూస్‌ డార్విన్‌’ ఛానల్‌ న్యూస్‌రూమ్‌లోకి ఓ పాము వచ్చింది. కంప్యూటర్‌ డెస్క్‌పైకి ఎక్కి సౌండ్‌ బాక్స్‌ల వెనకకు చేరింది. దీన్ని మొదటగా ఓ కెమెరాపర్సన్‌ గమనించి ఇతరులకు సమాచారం అందించాడు.

ఇంతలో ఓ మహిళా ఉద్యోగి ధైర్యంగా ముందుకు వచ్చి ఆ సర్పాన్ని చేతితో అక్కడి నుంచి లాగింది. మరో ఉద్యోగి సాయంతో దానిని సంచిలో పెట్టడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో పాము మహిళా ఉద్యోగిపై ఎదురుతిరిగినప్పటికీ ఆమె ఏ మాత్రం భయపడలేదు. ధైర్యంగా పాముని సంచిలోకి కుక్కింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.