తిరుపతిలో అలా దొరికిపోయిన హరితేజ, శివారెడ్డి…

0Hari-Teja‘బిగ్ బాస్’షోతో తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు హరితేజ. బిగ్ బాస్‌లో విజయం హరితేజకే వరిస్తుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు కానీ అందులో తనదైనశైలిలో రాణించిన హరితేజకు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. ఆ షోలో నటించక ముందువరకు హరితేజ అంటే ఎవరో తెలియదు. కానీ షో బాగా పాపులర్ అయిన తర్వాత హరితేజ దశ తిరిగి అవకాశాలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన దీపావళి పండుగ ప్రత్యేక కార్యక్రమాల్లో హరితేజ సందడి చేశారు.

హరితేజతో కమెడియన్ శివారెడ్డి పలువురు గాయనీ, గాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే హరితేజ, శివారెడ్డిల మధ్యే కెమిస్ట్రీ బాగా నడిచింది. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ కార్యక్రమం మొత్తం వీరిద్దరే నడిపించారు. హరితేజ మామూలుగా చేసే యాక్టింగ్ కన్నా ఎక్కువగా ఇందులో ఓవర్ యాక్టింగ్ చేసిందని అభిమానులు చెబుతున్నారు.

శివారెడ్డిని స్టేజ్‌పైన రకరకాల మాటలనడమేకాకుండా, వల్గర్‌గా కూడా మాట్లాడారు హరితేజ. అయితే అంతా కార్యక్రమంలో భాగమని శివారెడ్డి ఊరుకున్నా హరితేజ మాటలకు మాత్రం ఆ కార్యక్రమానికి వచ్చిన అభిమానులు మాత్రం ఇబ్బంది పడ్డారు. మరికొందరైతే వీరిద్దరి యాక్టింగ్ చూసి నోటి మీద వేళ్లేసుకున్నారు. జుగుప్సాకరంగా మాట్లాడటంలాంటి డైలాగులు ఉండటంతో ఫ్యామిలీలతో కార్యక్రమానికి వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు.