శ్యామల ఎలిమినేషన్ అట!

0



పాశ్చాత్య సంస్కృతిని ఇండియాకు తెచ్చిన బిగ్ బాస్ రియాలిటీ షోను తిట్టని వాళ్లు లేరు. తిట్టేవాళ్లెందరో పిచ్చిగా ఫాలో అయ్యేవాళ్లు అంతకు పదింతలు అని తెలుగు బిగ్బాస్ ప్రూవ్ చేస్తోంది. ఎన్టీఆర్ హోస్టింగ్ చేసిన సీజిన్ 1 – నాని హోస్టింగ్ చేస్తున్న సీజన్ 2 రెండిటికీ ఆదరణ దక్కింది. పెళ్లయిన – పెళ్లి కాని బ్యాచిలర్ యువతీయువకుల్ని ఒక ఇంట్లో పెట్టి తాళం వేసి – అటుపై వాళ్లేం చేస్తున్నారో సీసీ కెమెరాల్లో చూడడం అన్న బూతు ఆలోచన మా బాగానే వర్కవుటైంది. `పీపింగ్ టామ్` అన్న పదానికి ఆల్టర్నేట్ బిగ్ బాస్ అని సాంప్రదాయవాదులు బూతులు తిట్టేస్తున్నా సిగ్గు లేకుండా టీఆర్ పీ కోసం ఈ కార్యక్రమాన్ని టీవీ చానెళ్లు లైవ్ చేస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఎవరికి గోల వారిది.

బిగ్ బాస్ పైత్యం గురించి… గేమ్స్ పేరుతో.. పెళ్లయిన యువతి వేరొక యువకుడితో లాలూచి గురించి చాలానే చర్చ సాగుతోంది. అదంతా అటుంచితే వారం వారం ఈ ఇంటి నుంచి ఒకరిని గెంటేయడం అన్న ప్రక్రియపైనా అంతే ముచ్చట సాగుతోంది. ఈ వారం బిగ్ బాస్ నుంచి మ్యారీడ్ ఉమెన్ కం యాంకర్ శ్యామలను బయటికి పంపిస్తున్నారని లీక్ అందింది. నేటి రాత్రికి ఆ మ్యాటరేంటో తేలనుంది. అయితే శ్యామల ఓసారి ఇలానే బయటకు వెళ్లి – తిరిగి బిగ్ బాస్ ఇంట్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

రెండోసారి శ్యామల ఎలిమినేషన్ కారణమేంటి? అని ఆరాతీస్తే చాలానే సంగతులు తెలిశాయి. హౌస్ రూల్స్ ని అతిక్రమించడమే అసలు కారణమట. ఓటింగ్ విధానంలో కాకుండా `రూల్ బ్రేక్ తప్పిదం` అన్న కారణంతో శ్యామలను బయటికి పంపించేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇంటిబయటి వ్యవహారాలు ఇంట్లో మాట్లాడకూడదు! అన్న రూల్ ని బ్రేక్ చేస్తూ మరో పార్టిసిపెంట్ నూతన్ నాయుడు సీక్రెట్స్ గురించి శ్యామల హౌస్ లో ఇతరులకు చెప్పడం తప్పు అని తేల్చారట. ఇదివరకూ నూతన్ నాయుడు సైతం ఇలానే ఇంటి నుంచి గెంటివేయబడ్డాడు. ఇక శ్యామల డిస్మిస్ ఖాయమైన నేపథ్యంలో ఆ ఇంట్లో ఇంకా ఏడుగురు మిగిలారు. ఇంతటితో ఈ టార్చర్ వదిలిపోదా? అనుకుంటున్న ఆడియెన్ కి `బిగ్ బాస్ సీజన్ 2`ని మరో వారం పాటు పొడిగించారన్న వార్తను భళ్లున పేల్చారు. నేటి రాత్రి ఎపిసోడ్ తో శ్యామల వ్యవహారం తేల్తుందన్నమాట!