ఆ పాటకు సుమ డ్యాన్స్‌ చూశారా?

0ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల చక్కగా మాట్లాడటమే కాదు డ్యాన్స్‌ కూడా బాగా చేయగలరు. ప్రముఖ మలయాళీ నటుడు మోహన్‌లాల్‌ నటిస్తున్న ‘వెలిపడింతె పుస్తకం’ చిత్రంలోని ‘జిమ్మిక్కి కమ్మల్‌’ పాటకు ఈ మలయాళి కుట్టి తన ఇంట్లో డ్యాన్స్‌ చేశారు.

ఈ వీడియోని సుమ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ ‘జిమ్మిక్కి కమ్మల్‌ పాట నన్ను ఉర్రూతలూగిస్తోంది’ అని రాశారు. ఈ పాటను ఇప్పటికే 14 లక్షల మందికి పైగా వీక్షించారు. ఇప్పటికే చాలా మంది ఈ పాటకు పేరడీలు చేస్తూ వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. ఇటీవల ప్రముఖ అమెరికన్‌ టీవీ హోస్ట్‌ జిమ్మి కిమెల్‌ ఈ పాట తనకూ నచ్చిందంటూ ట్వీట్‌ చేశారు.