రాజ్ తరుణ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్!

0Andagadu-collectionsశుక్రవారం విడుదలైన అంధగాడు చిత్రం రాజ్ తరుణ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ని తెచ్చిపెట్టింది.ఈ చిత్రాన్ని రాజ్ తరుణ్ హ్యాట్రిక్ విజయంగా చెబుతున్నారు. రాజ్ తరుణ్ ఈ చిత్రంలో తన లక్కీ హీరోయిన్ హెబ్బా పటేల్ తో జత కట్టడం కూడా కలసివచ్చిందని చెప్పాలి.

కాగా ఈ చిత్ర నిర్మాతల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మంచి ఓపెనింగ్స్ ని సాధించినట్లు తెలుస్తోంది. విడుదల రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 3.75 కోట్ల వసూళ్లను సాధించింది. ఇవి రాజ్ తరుణ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ . ఈ చిత్రంలోని మలుపులు, సస్పెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించాడు.