ఏపీ బడ్జెట్ 2017-18 ముఖ్యాంశాలు

0




Yanamala-Rama-Krishnudu2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నూతనంగా నెలకొల్పిన శాసనసభలో తొలిసారి యనమల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. యనమల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది తొమ్మిదోసారి. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 1,56,999.4 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. రామకృష్ణుడు ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌(2017-18)లోని ముఖ్యాంశాలను ఒకసారి చూస్తే..

ముఖ్యాంశాలు

► మొత్తం బడ్జెట్‌ రూ. 1,56,999 కోట్లు

► రెవిన్యూ వ్యయం రూ. 1,25,911 కోట్లు

► పెట్టుబడి వ్యయం రూ. 31,087 కోట్లు

► వ్యవసాయ రంగానికి రూ. 9,090 కోట్లు

► గ్రామీణాభివృద్ధికి రూ. 19,565 కోట్లు

► సాగునీటి రంగానికి రూ. 12,770 కోట్లు

► విద్యుత్ రంగానికి రూ. 4,274 కోట్లు

► పరిశ్రమలు, గనులకు రూ. 2,085 కోట్లు

► రవాణా శాఖకు రూ. 3,946 కోట్లు

► జనరల్‌ ఇకో సర్వీసెస్‌కు రూ 4,813 కోట్లు

► విద్యారంగానికి రూ. 20,384 కోట్లు

► క్రీడలు, యువజన శాఖకు రూ. 1,005 కో్ట్లు

► సాంకేతిక విద్యకు రూ. 765 కోట్లు

► ఆరోగ్యశాఖకు రూ. 7,020 కోట్లు

► నీటిపారుదల, పారిశుద్ధ్య రంగానికి రూ. 1,575 కోట్లు

► హౌసింగ్‌ శాఖకు రూ. 1,456 కోట్లు

► పట్టణాభివృద్ధి శాఖకు రూ. 5,207 కోట్లు

► సంక్షేమ రంగానికి రూ. 11,361 కోట్లు

► రుణమాఫీకి రూ. 3,600 కోట్లు

► హోంశాఖకు రూ. 5,221 కోట్లు

► రహదారులు, భవనాల శాఖకు రూ. 4041 కోట్లు

► నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం కోసం రూ. 500 కోట్లు.

► రాజధాని అభివృద్ధికి రూ. 1,061 కోట్లు

► ఐటీ శాఖకు రూ. 364 కోట్లు

► పౌరసరఫరాల శాఖకు రూ. 2,800 కోట్లు

► పింఛన్లకు రూ. 4,376 కోట్లు

► నిరుపేదల విద్యుత్‌ సబ్సిడీకి రూ. 3,300 కోట్లు

► ఆరోగ్య శ్రీకి రూ 1000 కోట్లు

► ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ. 3,528 కోట్లు

► గ్రామీణ రహదారులకు రూ. 262 కోట్లు

► డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధి కింద రూ. 1,600 కోట్లు

► అన్నా క్యాంటీన్లకు రూ. 200 కోట్లు

► మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 100 కోట్లు

► కాపు కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లు

► బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 75 కోట్లు

► క్రైస్తవ కార్పొరేషన్‌కు రూ. 35 కోట్లు

► ఎన్టీఆర్‌ సుజల స్రవంతికి రూ. 100 కోట్లు

► ఎన్టీఆర్‌ వైద్య సేవకు రూ. 100 కోట్లు

► సాంస్కృతిక శాఖకు రూ. 78 కోట్లు

► స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 17,073 కోట్లు

► వికలాంగుల సంక్షేమానికి రూ. 90 కోట్లు

► ఎల్‌పీజీ కనెక్షన్లకు రూ. 350 కోట్లు

► మత్స్యశాఖకు రూ. 282 కోట్లు

► విశాఖ, కాకినాడ, తిరుపతి అభివృద్ధికి రూ. 450 కోట్లు

► షాదీఖానాలకు రూ. 1500 కోట్లు

► వరద నివారణకు రూ. 700 కోట్లు

► పర్యావరణ శాఖకు రూ. 4,813 కోట్లు

► పశుగణాభివృద్ధికి రూ. 1,112 కోట్లు

► పన్నుల ఆదాయం రూ. 82,855 కోట్లుగా అంచనా

► బడ్జెట్‌లో కేంద్ర పన్నుల వాటా రూ. 29,138 కోట్లు

► బడ్జెట్‌లో రాష్ట్ర పన్నుల వాటా రూ. 53,717 కోట్లు

► పన్నేతర ఆదాయం రూ. 5,092 కోట్లు

► కేంద్రం ఇచ్చే నిధుల అంచనా రూ. 37,548 కోట్లు

► ఎక్సైజ్‌ ఆదాయం రూ. 5,886 కోట్లు

► సేల్స్‌ ట్యాక్స్‌ ఆదాయం రూ. 39,321 కోట్లు