ఫుల్ జోష్ లో సెక్సీ బ్యూటీ

0

చెన్నై బ్యూటీ ఆండ్రియా జెరేమియా పేరు తెలుసు కదా.  స్ట్రెయిట్ తెలుగు సినిమాలలో పెద్దగా నటించకపోయినా.. తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా మన ప్రేక్షకులకు పరిచయమే. కార్తి ‘యుగానికి ఒక్కడు’. కమల్ హాసన్ ‘విశ్వరూపం’ సినిమాలు చూసినవారికి ఆమె నోటెడ్ ఫేస్. ఇక నాగ చైతన్య ‘తడాఖా’ లో కూడా ఈ భామ హీరోయిన్ గా నటించింది.   నటిగా మాత్రమే కాదు గాయనిగా కూడా తన సత్తా చాటింది ఆండ్రియా.  మిగతా సోషల్ మీడియా జెనరేషన్ భామల్లాగే ఆండ్రియా కూడా ఎప్పుడూ నెటిజనులతో టచ్ లో ఉంటుంది.

తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఒక ఏదో లైవ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నట్టుగా ఉంది.  స్టేజ్ పైన లైట్ల వెలుగు జిలుగులు..  పొగమంచులా అనిపించే తెల్లటి పొగ ఉండగా.. ఆండ్రియా ఫుల్ ఎనర్జీతో ఉన్నట్టుగా పెదవులు బిగించి.. పిడికిలి గట్టిగా పట్టుకునిమరీ పోజిచ్చింది. ఆండ్రియా గౌన్ అయితే సూపర్ గా ఉంది.  మోకాళ్ళకు పైగా ఉన్న షార్ట్ గౌన్..  వెనకవైపు ఆ గౌన్ పొడవుగా వేలాడుతున్నట్టుగా ఉంది.  మిగతావి ఎన్నున్నాఈ ఫోటోలో హైలైట్ మాత్రం భామ థైస్. ఇదే విషయన్ని ఒక నెటిజనుడు ‘థండర్ థైస్’ అంటూ గుర్తు చేశాడు.  దీంతోనే నెటిజనులలో చాలామందికి అందాన్ని ఆస్వాదించే సునిశిత దృష్టి ఉందని తెలిసిపోతోంది కదా. 

ఈ ఫోటోకు చాలామంది ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. ఒకరు “లేడి ఆన్ ఫైర్” అన్నారు. ఒకరు “స్మోకింగ్ హాట్” అన్నారు. మరొకరు “సెక్సీ థైస్ కాన్ఫిడెంట్ లుక్” అన్నారు. ఒకరు మాత్రం “మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తాను.. ఈ నంబర్ కు ఫోన్ చెయ్యండి” అన్నాడు.  ఆండ్రియా ఫోటోకు ఈ కామెంట్ కు ఏం సంబంధం లేదు. ఆయన జ్యోతిష్యం బిజినెస్ ప్రమోషన్ చేసుకుంటున్నాడు.  సరేలెండి.. ఇలాంటి వాళ్ళు  ఎక్కడైనా కామనే. ఇక ఆండ్రియా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘కా అనే తమిళసినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇదో థ్రిల్లర్ మూవీ.  నంజిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జాన్ మ్యాక్స్ నిర్మిస్తున్నారు.  ఈ సినిమా తో పాటు ‘మాలిగై’ అనే మరో తమిళ సినిమాలో కూడా నటిస్తోంది. 
Please Read Disclaimer