శ్రీరెడ్డి విషయంపై ఆండ్రియా హాట్ కామెంట్

0ఆండ్రియా.. హాట్ హాట్ గా నటించే తమిళ హీరోయిన్.. తొలుత గాయనిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అనంతరం తనకున్న గ్లామర్ తో హీరోయిన్ గా ఎదిగింది. పచ్చైక్కిళి ముత్తుచ్చారం – అయిరత్తిల్ ఒరువన్ – విశ్వరూపం – తరామణి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా కమల్ హాసన్ తీసిన ‘విశ్వరూపం2’లో హీరోయిన్ గా చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద నటి శ్రీరెడ్డి విషయంపై సంచలన కామెంట్లు చేసింది.

ఆండ్రియా మాట్లాడుతూ ‘‘ఇటీవల ఎక్కడికి వెళ్లినా నటి శ్రీరెడ్డి గురించే అడుగుతున్నారు.. ఆమె చెప్పేదంతా నిజమైతే అలా బహిరంగ పరచడానికి చాలా ధైర్యం కావాలి. నన్నైతే కాస్టింగ్ కౌచ్ చేయమని ఎవ్వరూ అడగలేదు.. అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు. అలాంటివి జరిగితే ధైర్యంగా బయటపెట్టడమే మంచిది. సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ ను పెంచి పోషిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి. ’ అంటూ శ్రీరెడ్డి పోరాటానికి మద్దతుగా నిలిచింది.

ఇక తన పర్సనల్ విషయాలను కూడా ఆండ్రియా చెప్పుకొచ్చింది.. విశ్వరూపం తర్వాత వడచెన్నై చిత్రంలో నటించానని.. ఆ చిత్రం తర్వాత ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నానని తెలిపింది. ఫ్యూచర్ ప్లాన్ ఏంటని అందరూ అడుగుతున్నారు.. కానీ నేను లంచ్ ఎక్కడ చేస్తానో కూడా ప్లాన్ చేసుకోను.. అలాంటి సినిమాల గురించి ఏం ప్లాన్ చేస్తానని చెప్పుకొచ్చింది.