మహేష్ సినిమాలో ఆ హాట్ హీరోయిన్ పాట

0Andrea-and-Maheshతమిళ సినీ పరిశ్రమలో ఆండ్రియా ఎప్పుడూ హాట్ టాపిక్కే. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో లిప్ లాక్ చేసి మీడియాకు దొరికిపోయినా.. ‘యుగానికి ఒక్కడు’ లాంటి సినిమాలో తన హాట్ హాట్ అందాలతో కనువిందు చేసినా.. అప్పుడప్పుడూ గొంతు సవరించుకుని అదిరిపోయే పాటలు పాడినా.. ఇలా ఏం చేసినా ఆండ్రియా తీరే వేరుగా ఉంటుంది.

బహుముఖ ప్రజ్నాశాలి అయిన ఆండ్రియా ఇటీవలే ‘డిటెక్టివ్’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఇందులో ఆండ్రియా చేసిన నెగెటివ్ రోల్ ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఈ అమ్మాయి త్వరలోనే ఓ క్రేజీ తెలుగు సినిమాలో ఓ పాట పాడబోతుండటం విశేషం.

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘భరత్ అను నేను’ సినిమాలో ఆండ్రియాతో ఒక పాట పాడిస్తున్నాడు ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఆండ్రియా తమిళ సినీ పరిశ్రమకు పరిచయమైంది గాయనిగానే. ‘గోవా’ అనే సినిమాలో ఆమె పాడిన ఇదువరై.. పాటు ఆమెకు ఎన్నో అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టింది. టిపికల్ వాయిస్ ఉన్న ఆండ్రియా.. ఏ పాట పాడినా చాలా స్పెషల్‌గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకులకు కొత్త కొత్త గొంతుల్ని పరిచయం చేసే దేవి.. ఆండ్రియాతో పాడిస్తున్నాడంటే ఆ పాట సమ్‌థింగ్ స్పెషల్ అయి ఉండే అవకాశముంది. ఈ సినిమా వేసవిలో విడుదల కానున్నప్పటికీ ఈపాటికే దేవి.. ఆడియో దాదాపుగా పూర్తి చేసేసినట్లు సమాచారం.