కొత్త సినిమా కోసం కొత్త నటులు

0Angamaly-Diaries-Movie-Remaఇప్పుడు తెలుగు సినిమాలో కొత్త నటులు హవా పెరుగుతుంది. ఏడాదికి ఏదో ఒక విభిన్న కథతో వచ్చిన ఒక సినిమా ప్రేక్షక ఆదరణ పొందుతుంది. ఆ సినిమా ద్వారా కొంతమంది కొత్త టాలెంట్ ఇండస్ట్రి కి పరిచయం అవుతున్నారు. ఇప్పుడు వస్తున్న చాలా సినిమాలలో కమర్షియల్ కథతో పాటుగా మన అనుకునే మన శ్రీనివాస్ కథో లేక మన మల్లేశ్ కథో అందులో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మన చిన్న సినిమాలలో.

ఈ ఏడాది మొదటిలో మలయాళం ఇండస్ట్రి లో ఒక సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు సాదించింది. అంటే ఒక స్టార్ హీరో బాక్స్ ఆఫీసు కలెక్షన్లు అంతా కాకపోయినా ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ తో సరితూచి చూస్తే పెద్ద విజయం అనే చెప్పాలి. ‘అంగమలి డైరీస్’ అనే ఒక మలయాళం సినిమా మార్చ్ నెలలో విడుదలై మంచి హిట్ అయ్యింది. రెండు లోకల్ గ్యాంగ్ స్టార్ గ్రూప్లు మధ్య వైరాన్ని చిన్న హీరోలతో చాలా వరకు కొత్తవాళ్ళతో తీశారు. అక్కడ పల్లెటూరులో ఉండే గొడవలు వాటి మధ్య ఒక చిన్న ప్రేమ కథతో కొత్తగా చెప్పారు. ఇప్పుడిదే సినిమాను మన తెలంగాణ ప్రాంతం నేపధ్యంలో తెలుగులో తీయబోతున్నారు.

నిజానికి ఆ సినిమాను చూసి.. ఇక్కడెవరైనా పెద్ద హీరోలు చేస్తే ఇంకా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటే.. ఇప్పుడు మాత్రం కొత్త వారితోనే ఈ సినిమాను తీస్తాం అంటూ రైట్స్ కొనుకున్న నిర్మాతలు చెబుతున్నారు. గతంలో ఇలాగే బెంగుళూరు డేస్ సినిమాను కూడా రైట్స్ కొన్నాక నానా రచ్చ చేసి చివరకు పాడు చేశారు. సినిమా డిజాష్టర్ అయ్యింది. తెలుగులో రాలేదు. అలాంటి అనుభవాలను చూసి ఏం నేర్చుకున్నారు సామి?