సినిమాలకు ప్రముఖ నటి గుడ్‌బై !

0Angelina-jolieహాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి ఎంజెలీనా జోలీ సినిమాలకు గుడ్‌బై చెప్తున్నదా? మేల్‌ఫిసెట్ 2 ఆమె ఆఖరి చిత్రం కానున్నదా అంటే అవును అంటున్నాయి హాలీవుడ్ వర్గాలు. హాలీవుడ్‌లో ఏంజెలీనా జోలీ రిటైర్‌మెంట్ గురించి ప్రముఖంగా వార్తలు ప్రచురించాయి. ప్రస్తుతం దాంపత్య జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. భర్త, ప్రముఖ నటుడు బ్రాడ్ పిట్‌తో విడాకుల కేసు విషయంలో కోర్టుతో న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.

తన పిల్లల సంరక్షణ కోసం సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకొంటున్నది. సినిమాలను కూడా ఒప్పుకోవడం మానేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేవు. సినిమా కథలు, రచనలపై, దర్శకత్వంపై దృష్టిపెట్టింది. నటనకు వీడ్కోలు చెప్పాలని భావిస్తున్నది అని మీడియా కథనాలు వెల్లడించాయి.

ప్రస్తుతం బ్రాడ్ పిట్, ఎంజెలీనా జోలీ మధ్య వైవాహిక సంబంధాలు అంతంతా మాత్రంగానే ఉన్నాయి. పిల్లలపై దురుసుగా ప్రవర్తించడం, దాడికి పాల్పడటం లాంటి అంశాలు వారి మధ్య విబేధాలకు కారణమయ్యాయి. ప్రస్తుతం ఆరుగురు పిల్లలపై సంరక్షణను తనకే అప్పగించాలని ఏంజెలీనా కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ కేసు పెండింగ్‌లో ఉంది.

జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని విషయాల పట్ల ఏంజెలీనా జోలీ చాలా అసంతృప్తిగా ఉంది. ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని సరిదిద్దుకోవాల్సనుకొంటుంది. పిల్లల బాగోగులను శ్రద్ధ పెట్టింది అని హాలీవుడ్‌కు చెందిన ఓ మ్యాగజైన్ కథనాన్ని ప్రచురించింది.

గతంలో మేల్‌ఫిసెంట్ చిత్రంలో ఏంజెలీనా జోలీ నటించిన సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్‌గా వస్తున్న మేల్‌ఫిసెంట్ 2 చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నది. అదే చివరి చిత్రమయ్యే అవకాశముందనే వార్తలు వెలువడుతున్నాయి. ఏజెంలీనా ఓ విదేశీ చిత్రంలో కూడా నటించింది. ఫస్ట్ దే కిల్డ్ మై ఫాదర్‌: ఏ డాటర్ ఆఫ్ కాంబోడియా రిమెంబర్స్ అనే చిత్రం ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే ఈ చిత్రం వీడియో యాప్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నది.