ఆ హాలీవుడ్ నటి ఇప్పుడలా చేస్తుందట

0Angelina-jolieయావత్ ప్రపంచం మొత్తం ఆరాధించే సెలబ్రిటీలు చాలా చాలా తక్కువగా ఉంటారు. తమ అందంతోనూ.. తమ పనులతోనూ అందరి దృష్టిలో పడి.. అందరి మనుసుల్ని దోచుకునే వారు మరీ తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో ఒకరు హాలీవుడ్ హాట్ సుందరి ఏంజిలినా జోలీ.

ఆమె అందం ఒక ఎత్తు అయితే.. ఆమె మనసు గురించి చాలా గొప్పగా చెబుతారు. ఆమె మైండ్ సెట్ కు ఫిదా అయ్యే వారెందరో. బాధితులుగా ఉన్న పిల్లల్ని దత్తత తీసుకొని.. సొంత పిల్లలు మాదిరి చూసుకోవటం ఏంజెలీనాకే చెల్లింది. ఇప్పుడామె ఆరుగురు పిల్లల తల్లి. అయితే.. భర్త బ్రాడ్ పిట్ తో వచ్చిన విభేదాలతో ఆమె ఈ మధ్యనే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

అన్యోన్య జంటగా పేరున్న వీరి మధ్య మద్యం కొత్త సమస్యల్ని తెచ్చి పెట్టింది. తాగిన మైకంలో పిల్లల పట్ల బ్రాడ్ పిట్ అమర్యాదకరంగా వ్యవహరిస్తుండటంతో అతడి వైఖరికి విసుగు చెందిన ఏంజెనీలా విడాకులు తీసేసుకుంది. తాజాగా ఆమె సినిమాలకు దూరంగా ఉంది. ఎందుకన్న విషయాన్ని ఆరా తీస్తే షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది.

బ్రాడ్ పిట్ తో దూరంగా ఉంటున్న నాటి నుంచి సినిమాలకు ఓకే చెప్పకుండా ఉన్న ఏంజెలీనా.. తన సమయం మొత్తాన్ని పిల్లల్ని చూసుకునేందుకు వెచ్చించాలన్న నిర్ణయం తీసుకుందట. పిల్లల్ని చూసుకునే పనిలో భాగంగా వంట చేయటం.. ఇంటిని శుభ్రం చేయటం లాంటి వాటిని నేర్చుకోనుందట. ఇందుకోసం ఆమె సలహాలు.. సూచనలు తీసుకుంటుందట. హాలీవుడ్ లో తిరుగులేని స్థానంలో ఉండి కూడా పిల్లల కోసం కెరీర్ పక్కన పెట్టి.. చీపురు.. గరిటె పట్టుకోవటం ఏంజెలీనాకు మాత్రమే సాధ్యమేమో?