బాపు ఎడిటర్ .. ఇక లేరు

0ప్రముఖ ఎడిటర్‌ అనిల్‌ మల్నాడ్‌ (62) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 8 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. సినిమాటోగ్రఫీ పై మక్కువతో మద్రాసులో అడుగుపెట్టిన అనిల్.. సీటు దొరక్కపోవడంతో దర్శకత్వ శాఖలో చేరారు.ప్రఖ్యాత దర్శకుడు బాపు తీసిన ‘సంపూర్ణ రామాయణం’ చిత్రానికి సహాయ దర్శకుడిగా చేరారు.

మరోవైపు ఎడిటింగ్‌పైనా దృష్టి పెట్టారు.అనిల్ పని తీరు నచ్చి తాను దర్శకత్వం వహించిన ‘వంశవృక్షం’ చిత్రం ద్వారా ఎడిటర్‌ని చేశారు బాపు. ఒక్క బాపూ దగ్గరే 22 సినిమాలకుఅని ఎడిటర్‌గా చేయడం విశేషం. దర్శకుడు వంశీ చిత్రాలకూ చేయడం మొదలుపెట్టారు. వంశీ తెరకెక్కించిన ‘సితార’ ద్వారా ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. పలు నంది అవార్డులూ సొంతం చేసుకున్నారు. తెలుగులో కె. రాఘవేంద్రరావు, గీతాకృష్ణ వంటి పలు దర్శకుల చిత్రాలకూ, తమిళంలో ఆర్వీ ఉదయ్‌కుమార్, ఆర్‌.కె. సెల్వమణి తదితరుల చిత్రాలకూ పని చేశారు. దాదాపు రెండువందల పై చిత్రాలకు పనిచేశారు అనిల్ మాల్నాడ్.