ఫన్ ఫ్రస్ట్రేషన్ కు సీక్వెల్ ఉందన్న దర్శకుడు

0

వెంకటేష్ – వరుణ్ తేజ్ లు కలిసి నటించిన మల్టిస్టారర్ ‘F2’ సంక్రాంతి సీజన్లో చివరగా విడుదలయిన సినిమానేగానీ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. పండగ సీజన్లో ఆడియన్స్ కోరుకునే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో పుష్కలంగా ఉండడంతో మిగతా సినిమాలకంటే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు మొదటి ప్రిఫరెన్స్ గా మారింది.

ముఖ్యంగా వెంకీ కామిక్ టైమింగ్.. మరో యంగ్ హీరో వరుణ్ తో కాంబినేషన్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అన్ని ఏరియాలనుండి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండడంతో దర్శకుడు అనిల్ రావిపూడి..’F2′ టీమ్ ఖుషిఖుషీగా ఉన్నారు. ఈ ఊపులోనే అనిల్ రావిపూడి ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ చేశాడు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని వెల్లడించాడు. ఇప్పటికే సీక్వెల్ కు కోసం హీరోలు వెంకటేష్.. వరుణ్ తేజ్ ల నుండి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నానని చెప్పాడు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘గోల్ మాల్’ సీరీస్ తరహాలో ‘F2’ ను కూడా ఒక సీరీస్ లా ప్లాన్ చేస్తామని తెలిపాడు.

నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఈ ‘F2’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నానని.. ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ సినిమా స్టొరీ పై వర్క్ చేయడం మొదలు పెడతానని అన్నాడు. కానీ ‘F2’ సీక్వెల్ ను ఎప్పుడు తెరకెక్కిస్తారనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
Please Read Disclaimer