పవన్ కోసం అనిరుధ్ పాటలు రెడీ

0Pawan-and-Anirudh,పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడుతో సెన్సేషన్స్ ను క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఒక వైపు ఆన్ లైన్ సంచలనాలతో పాటు.. మరోవైపు రికార్డ్ స్థాయి బిజినెస్ కూడా చేసుకుంటోంది ఈ మూవీ. తాజాగా అమెరికా నుంచి తిరిగి వచ్చిన పవన్.. వెంటనే కాటమరాయుడును పూర్తి చేసే పనిలో పడ్డాడు. మార్చ్ మొదటివారానికల్లా ఈ మూవీకి గుమ్మడికాయ కొట్టాయాలన్నది పవన్ ఐడియా.

మార్చ్ 14న త్రివిక్రమ్ దర్శకుడిగా పవర్ స్టార్ మూవీ ప్రారంభానికి ముహూర్తం పెట్టేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయిపోగా.. మరోవైపు కోలీవుడ్ యంగ్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ తొలిసారిగా ఓ టాలీవుడ్ మూవీకి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ సినిమా కోసం తన పని ప్రారంభించేసిన అనిరుధ్.. ఇప్పటికే మూడు పాటలకు ట్యూన్స్ కూడా రెడీ చేసేశాడట. రీసెంట్ గా వీటిని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు వినిపించాడట అనిరుధ్.

మాటల మాంత్రికుడికి.. ఈ కంపోజర్ వినిపించిన ట్యూన్స్ విపరీతంగా నచ్చేశాయట కూడా. ఆల్రెడీ ఈ మూడు ట్యూన్స్ ను లాక్ చేసేసుకున్నారని తెలుస్తోంది. మరో మూడు పాటలను కూడా మార్చ్ చివరికల్లా ఇచ్చేస్తానని అనిరుధ్ చెప్పినట్లు టాక్. కీర్తి సురేష్.. అను ఇమాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ.. అంతా అనుకున్నట్లుగా జరిగితే.. సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.