వైన్ – బీరు తాగాను పిజ్జా తిన్నాను: అనిత

0హీరోయిన్ అనిత పేరు తెలుసా? ఇప్పుడైతే టాలీవుడ్ నుండి ఫేడ్ అవుట్ అయ్యి హిందీ సీరియల్స్ తో బిజీగా ఉంటోంది గానీ గతంలో ‘నువ్వు నేను’ లాంటి పలు సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో నటించింది. ముప్పైల్లో ఉన్నా ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ ఇప్పటికీ ఇరవైలలో ఉండే మోడల్స్ కు పోటీ ఇస్తోంది. ఈ అనిత హసనందాని ఈమధ్య తన భర్తతో గ్రీస్ దేశానికి విహార యాత్రకు వెళ్ళింది.

జనాలు ఊరికే సోది చెప్తుంటారు గానీ జీవితం ఉండేది ఎంజాయ్ చేసేందుకే కదా. అందుకే ఈ అమ్మడు గ్రీస్ లోని వోల్కనో ఆఫ్ సాంటోరిని అనే ప్రదేశం లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోందట. మంచి హాటు ఫోటో ఒకటి పెట్టి ఇన్స్టాగ్రామ్ లో ఇలా రాసింది “నేను పిజ్జా తిన్నా. సాంటోరిని లో ఉండే వైన్ అంతా తాగా. లోకల్ బీరేసుకున్నా. ఒక్క ముక్కలో చెప్తే నా భర్తతో నా జీవితాన్ని ఫుల్లుగా జీవిస్తున్నా. జీవితం చాలా చిన్నది. జీవించండి నవ్వండి ప్రేమించండి.”

సభ్య సమాజానికి ఆవిడగారు ఇచ్చిన పిజ్జా-వైను-బీరు సందేశం మీకు సరిగ్గానే అర్థం అయి ఉంటుంది. దాంతో పాటు ఓ ఫిలాసఫీ కూడా చెప్పింది కదా “జీవించండి – నవ్వండి – ప్రేమించండి.” వీలైతే ఫాలో అవ్వండి లేకపోతే మన చానల్స్ లో వచ్చే వితండవాదుల నెవర్ ఎండింగ్ చర్చలు చూస్తూ కాలాన్ని గడపండి. అంతలోపు ఈ సుందరి హాట్ ఫోటోపై ఓ లుక్కేయండి!