తిరుపతిలో అంజలి పెళ్లి?

0


Jai-Anjaliతమిళ సినిమాల్లో హవా సాగించిన తెలుగమ్మాయి అంజలి త్వరలోనే పెళ్లి కూతురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ హీరో జైతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన అంజలి.. మూడు ముళ్ల బంధానికి సిద్ధమైనట్లు సమాచారం. జై-అంజలి త్వరలోనే తిరుమలలో పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

తిరుమలలో సింపుల్గా పెళ్లి చేసుకుని చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తారట. ఆ తర్వాత అంజలి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడి సన్నిహితులకు పార్టీ ఇవ్వాలని భావిస్తోందట. శుక్రవారం అంజలి పుట్టిన రోజు సందర్భంగా జై సోషల్ మీడియా ద్వారా ఓ అందమైన మెసేజ్ తో తన ప్రేమను చాటుకున్నాడు. ఆమె వచ్చాక తన జీవితంలో ప్రతి రోజూ ప్రత్యేకంగా మారిపోయిందని అన్నాడు. నేనెప్పుడూ నీతోనే ఉంటా అని కూడా వ్యాఖ్యానించాడు.

బదులుగా అంజలి కూడా జై తనకెంత ప్రత్యేకమో ఓ మెసేజ్ లో చెప్పింది. దీని ద్వారా జై అంజలి తమ ప్రేమను బహిరంగపరిచినట్లే. ఇక దాపరికాలేమీ లేనట్లే. ‘జర్నీ’ సినిమా చేస్తున్న సమయంలో జై – అంజలి ఒకరికొకరు దగ్గరయ్యారు. ఈ మధ్య వాళ్ల ప్రేమ డీప్ అయింది. సూర్య ఆ మధ్య సెలబ్రెటీ భార్యాభర్తలకు విసిరిన దోసె సవాల్ ను వీళ్లిద్దరూ స్వీకరించి.. దోసెతో సెల్ఫీ దిగడంతో ఈ ప్రేమ సంగతి బయటికి వచ్చింది.