ఇంటి నుంచి పారిపోయి.. హీరోయిన్ అయ్యింది..!

0


Kaadhal-telugu-movie-heroinఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాల్లో ట్రయింగ్యులర్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఇంట్రస్టింగ్ మూవీ కాదలి. సినిమా కథ విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన గుజరాతీ భామ పూజ స్టోరినే ఓ సినిమా కథలా ఆకట్టుకుంటోంది.గుజరాత్ రాజ్ కోట్ లోని సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన ఈ భామ, తన కలను నెరవేర్చుకోవటం కోసం పెద్ద సాహసమే చేసింది. చిన్నప్పటి నుంచి సిల్వర్ స్క్రీన్ మీద వెలిగిపోవాలనే కలను కంటూ పెరిగింది పూజ.

అయితే ఆమె కుటుంబ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉండేవి. ‘అచ్చీ ఘర్ కి లడికి యా ఫిలిం మే యాక్టింగ్ నహీ కర్తే’ అంటూ తల్లి దండ్రులు ఆంక్షలు విధించారు. అయితే ఎలాగైన తన కలను నిజం చేసుకోవాలనుకున్న పూజ ఇంటినుంచి పారిపోయిన ముంబై రైలెక్కేసింది. ఏడాది పాటు ఫోటో షూట్ లు, యాడ్స్ చేసిన పూజకు అదృష్టం తలుపు తట్టింది. కాదలి టీం నుంచి ఫోన్ వచ్చింది. ఆడిషన్ లాంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకోని ఓ ఇంట్రస్టింగ్ ట్రయాంగ్యులర్ లవ్ స్టోరితో తెలుగు తెరకు హీరోయిన్ పరిచయం అయ్యింది.