రాజకీయాల్లోకి హీరోయిన్ అంజలి??

0Anjali Ready To Enter Into Politicsఎప్పటికప్పుడు కొత్త సమీకరణాలు మారుతూ ఉండే సినిమా-రాజకీయం అంటే మన ప్రజలు మంచి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకు అనుగుణంగానే అక్కడ కూడా కొత్త కొత్త పరిణామాలు జరుగుతూ ఉంటాయి. బాగా క్రేజ్ ఉన్న నటులు  సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిన నటులు రాజకీయాల్లోకి వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చి విజయ పతాకం ఎగరవేసిన సంధర్భాలు చాలనే ఉన్నాయి మన సౌత్ ఇండియాలో. తమిళనాట.. మన తెలుగునాట.. అందులో ముందు వరుసలో ఉంటాయి. ఇప్పుడు తమిళనాడు రాజకీయం ఎటువైపు వెళుతుందో రజినీకాంత్ – కమల్ హాసన్ ఈ పరిస్థితులులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో అనేది దేశం మొత్తం ఎదురుచూస్తూ ఉంది. ఇటువంటి  పరిస్థితులులో ఒక యంగ్ హీరోయిన్ రాజకీయ ప్రవేశం చేయబోతుంది అని వార్తలు వస్తున్నాయి.

అవ్వడానికి ఆంద్ర అమ్మాయి అయన తెలుగులో కన్నా తమిళనాడులో మంచి పేరు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ అంజలి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. అంజలి ఈ మధ్య దేశ రాజధానిలో ఉన్న పార్లమెంట్ను విజిట్ చేసి వచ్చింది. ఎవరిని కలవడానికి వెళ్లింది ఎందుకు వెళ్లింది అనేది ఒక స్పష్టత లేకపోయినా ఏదో పార్టీ అధినేతతో మంతనాలు జరిపినట్లు టాక్. దీనితో మీడియా అంతా ఆమె రాజకీయ రంగప్రవేశంపై దృష్టిపెట్టారు. ఒక మీడియా ఇంటర్వ్యూలో నాకు రాజకీయాలు అంటే చాలా ఆసక్తి అని నేను వాటిని క్రమం తప్పకుండా ఫాలో అవుతాను అని చెప్పింది. దానితో అంజలి ఏదో ప్రాంతీయ పోలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తన నటనతో కోలీవుడ్ టాలీవుడ్లోనూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది అంజలి.  అయితే ఈ మధ్య సినిమాలు వలన కన్నా ఆమె తన ఫ్యామిలీ మరియు ప్రేమ కథ వలన వార్తల్లోకి వస్తోందిలే.  పినతల్లితో విభేదం నటుడు జైతో ప్రేమాయణంతో అప్పటిలో కొన్ని వివాదాలుతో హాట్ న్యూస్ గా మారింది. అంజలి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయబోతుంది అనే వార్త ఇప్పుడు అందరినీ ఆవాక్కు చేస్తోంది. ఈ పుకారు పక్కనపెడితే  అంజిలి నటించిన తమిళ్ సినిమా  ‘బెలూన్’   త్వరలో విడుదలవ్వడానికి సిద్దంగా ఉంది.