సైలెంట్ గా ఏఎన్నార్ బయోపిక్ రెడీ?

0దివంగత మహానటుడు అండ్ నేత అయిన నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రెడీ అవుతోంది. ఎన్టీఆర్ లైఫ్ పై 3-4 రకాల యాంగిల్స్ లో ప్రాజెక్టులు ప్రకటించినా.. అన్నిటికంటే ఆసక్తికరమైన మూవీ బాలకృష్ణ తీస్తున్న ఎన్టీఆర్ మాత్రమే. ఇప్పుడు ఎన్టీఆర్ సమకాలికుడు.. ఆ మాటకు వస్తే ఎన్టీఆర్ కంటే కొన్నేళ్ల సీనియర్ అయిన అక్కినేని నాగేశ్వరరావు జీవితంపై కూడా సినిమా తీసేందుకు రంగం సిద్ధమవుతోందని అంటున్నారు.

ఈ విషయంపై ఎలాంటి ఆర్భాటాలు.. ప్రకటనలు లేకుండానే.. స్క్రిప్ట్ ప్రిపేర్ చేసే పని చకచకా జరిగిపోతోందట. అన్నపూర్ణ ఫిలిం స్కూల్ స్టూడెంట్స్ కు ఈ బృహత్తర కార్యాన్ని అప్పగించినట్లుగా సినీ జనాలు చెప్పుకుంటున్నారు. కొన్ని నెలల క్రితమే రీసెర్చ్ ప్రారంభం అయిపోయిందని.. ఇప్పుడా వర్క్ దాదాపు ఫైనల్ స్టేజ్ కు వచ్చిందని అంటున్నారు. ఫిలిం స్కూల్ ట్రైనీలు తమ పరిశోధన పత్రాలను డ్రాఫ్టింగ్ చేసే పనిలో పడ్డారట. వీటన్నిటి ఆధారంగా పెద్దాయన జీవితంపై ఓ స్క్రిప్ట్ లైన్ ప్రిపేర్ చేసుకుంటారని తెలుస్తోంది.

అయితే.. ఎన్టీఆర్ మాదిరిగా కాకుండా.. ఏఎన్నార్ బయోపిక్ లో ఆయన పూర్తి జీవితాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. ఆఖరికి అక్కినేని అంతమ యాత్ర కూడా ఇందులో ఉంటుందని చెబుతున్నారు. ఈ మూవీలో యంగ్ ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్యను.. వయసు మీద పడిన పాత్రలో నాగార్జునను చూపించాలనే ఆలోచన చేస్తున్నారని.. ఆ ఐడియా సూపర్బ్ గా క్లిక్ అవుతుందని టాక్.