మోడీకి మరో ఝలక్… నాలుగేళ్లలో మీరు చేసింది ఏంటి అంటూ, సొంత పార్టీ ఎంపీ లేఖ…

0ప్రధాని మోడీ పై, విపక్ష పార్టీల ఎంపీలకే కాదు, సొంత పార్టీ ఎంపీలకు కూడా నమ్మకం పోతుంది… ఇప్పటికే బీజేపీలో మోడీ వ్యతిరేక వర్గం, టైం కోసం చూస్తుంది అని వార్తలు వస్తున్నాయి… అద్వానీకి జరిగిన అవమానానికి బదులు తీర్చుకోటానికి ఇప్పటికే కొంత ఎంపీలు రెడీగా ఉన్నారు.. అందుకే మోడీ, అవిశ్వాసం ఎదుర్కోకుండా పారిపోయారు అనే వార్తలు వస్తున్నాయి… మురళీ మనోహర్ జోషి, శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హా, బహిరంగంగానే మోడీ పై విమర్శలు చేస్తున్నారు… మొన్న ఒక దళిత ఎంపీ కూడా ప్రధాని పై లేఖ రాస్తూ విమర్శలు గుప్పించారు… తాజాగా, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మరో దళిత ఎంపీ యశ్వంత్ సింగ్ ఊహించని షాక్ ఇచ్చారు.

 కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో దళితుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపిందంటూ నిలదీశారు. నాగిన నియోజవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్న యశ్వంత్.. కేవలం రిజర్వేషన్ కారణంగానే తాను ఎంపీనయ్యానన్నారు. ‘‘ఒక దళితుడిగా నా సామర్ధ్యాన్ని ఏమాత్రం ఉపయోగించుకోవడం లేదు. నేను కేవలం రిజర్వేషన్ కారణంగానే పార్లమెంటు సభ్యుడిని కాగలిగాను. దేశంలోని 30 కోట్ల మంది దళితులకు గత నాలుగేళ్లలో కేంద్రప్రభుత్వం చేసింది శూన్యం…’’ అంటూ తన లేఖలో ధ్వజమెత్తారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై ఇటీవల ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించారు.

కాగా ఇటీవల యూపీలోని రాబర్ట్స్‌గంజ్ ఎంపీ ఛోటే లాల్ ఖార్వార్ కూడా ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. సీఎం యోగి ఆదిత్యనాథ్ వద్దకు సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే తనను బలవంతంగా గెంటేశారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. చాందౌలీలోని అటవీ అధికారులు, జిల్లా అధికారులు ‘‘అవినీతి’’ పాల్పడుతున్న విషయాన్ని రెండుసార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లినా కనీసం పట్టించుకోకుండా… తన పట్ల దారుణంగా వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. దళిత ఎంపీ అయిన ఛోటేలాల్… ఇదే అంశంపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. – Amaravathivoice