అంతరిక్షం: దీపావళి జంట అదిరెను

0

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం `అంతరిక్షం 9000 కెఎంపిహెచ్`. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది. `ఘాజీ` ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఘాజి లాంటి ప్రయోగం తర్వాత సంకల్ప్ చేస్తున్న మరో అసాధారణమైన సాహసం ఇదని చెప్పొచ్చు. ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది.

తాజాగా దీపావళి కానుకగా మరో ఆకట్టుకునే పోస్టర్ ని చిత్రయూనిట్ రివీల్ చేసింది. ఈ పోస్టర్ లో లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ పెయిర్ మధ్య సంథింగ్ ఆకట్టుకుంది. ఆరున్నర అడుగుల ఆజానుభాహుడు ఆకాశం ఎత్తుకు ఎదిగాడా? అన్నంతగా వరుణ్ తేజ్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్నాడు. దీపాల కాంతిలో దివ్వెలు వెలిగిస్తూ సాంప్రదాయ దుస్తుల్లో లావణ్య త్రిపాఠి అంతే అందంగా కనిపిస్తోంది. ఈ జోడీ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుటవుతోందనడానికి ఈ ఫోటోనే సాక్ష్యం.

ఈ చిత్రానికి జ్ఞానశేఖర్ లాంటి మాస్టర్ మైండ్ సినిమాటోగ్రఫీ అందించడం మరో ప్రధాన బలం. ఆ విజువల్స్ ఫోటోల రూపంలో బయటకు వస్తున్నాయి. డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer