శైలజా రెడ్డి చేతుల్లో ఆమె ఫ్యూచర్!

0ఎన్ని సార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా పదే పదే చెప్పినా ఒకటే నిజం ‘సక్సెస్ హ్యాజ్ మెనీ ఫ్రెండ్స్ ఫెయిల్యూర్ డజ్ నాట్. ఎప్పుడూ సక్సెస్ లో ఉండేవాడికి ఈ లాజిక్ లో నిజం ఉందని అనిపించదు కానీ.. ‘టెంపర్’ లో ఎన్టీఆర్ ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెప్తాడు.. ‘జీవితం ఎవ్వరినీ వదిలిపెట్టదు. అందరి సరదా తీర్చేస్తది.. నాది కూడా తీరిపోయింది’ అలా ‘సరదా తీరిన’ వాళ్ళకు మాత్రం చక్కగా అర్థం అవుతుంది. ఇప్పుడు మలయాళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్ కు దాదాపు ఈ పరిస్థితి ఎదురయ్యేలా ఉంది.

అనును అందరూ మొదట్లో లక్కీ అన్నారు. వరసగా ఆఫర్లు వచ్చాయి.. ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’ లో కూడా ఛాన్స్ వచ్చింది. కాకపోతే ఏ సినిమా కూడా హిట్ కాకపోవడంతో ఇపుడు కెరీర్ లో సడెన్ బ్రేక్ పడే స్టేజ్ కి వచ్చింది. ఆల్రెడీ ఎన్టీఆర్ సినిమా ‘అరవింద సమేత’ లో అవకాశం లాస్ట్ మినిట్ లో మిస్సయింది. ఇప్పుడు రెండు సినిమాలకు తన పేరు పరిశీలిస్తున్నారట. అందులో ఒకటి వరుణ్ తేజ్ – సాగర్ చంద్ర సినిమా. మరొకటి నితిన్ – వెంకీ కుడుముల ఫిలిం. కాకపోతే ఈ అవకాశం ఆమె ‘ఈగో’ ని బట్టి ఉంటుంది.

అర్థం కాలేదా. ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలో ఈగో ఫుల్ గా ఉన్న పాత్ర పోషిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా కనుక హిట్ అయితే ఈ రెండు ఆఫర్లు వస్తాయట. సినిమా కనుక నిరాశపరిస్తే.. రెండూ ఉండవు. మరి శైలజా రెడ్డి ఈమెను ముంచుతుందో తేలుస్తుందో తెలియాలంటే రిలీజ్ వరకూ వేచి చూడాలి.