మజ్ను భామతో మరోసారి!!

0Anu-Emmanuel-Is-Heroine-Forమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో ఛాన్స్ అంటే హీరోయిన్లంతా ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో హీరోయిన్ కు ఇటు గ్లామర్ గా.. అటు యాక్టింగ్ పరంగా పేరొస్తుంది. అందులోనూ స్టార్ హీరోలతో తీసే సినిమాల్లో ఛాన్స్ దొరికిందంటే అదృష్టం వరించిందన్న మాటే. మజ్ను సినిమాతో తెలుగులో అడుగెట్టిన సుందరి అను ఇమ్మానుయేల్ కు లక్కు డబులైనట్టుంది. అతి తక్కువ టైంలోనే త్రివిక్రమ్ డైరెక్షన్ లో రెండో సినిమా చేసే అవకాశం ఆమె తలుపు తడుతోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరోసారి పవర్ స్టార్ తో తీస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ – అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరగకముందే షూటింగ్ పూర్తి చేయాలని త్రివిక్రమ్ చకచకా తన పని చేసుకుంటూ పోతున్నాడు. ఇదే టైంలో తన తర్వాత సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు. ఇందులో హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాడనేది ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ జైలవకుశ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పని పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు.

తన సినిమాల్లో నచ్చిన హీరోయిన్ ను వెంటనే రిపీట్ చేయడం త్రివిక్రమ్ కు అలవాటే. అతడి డైరెక్షన్ లో వచ్చిన జల్సాలో నటించిన ఇలియానా తర్వాత జులాయిలోనూ నటించింది. అత్తారింటికి దారేదిలో యాక్ట్ చేసిన సమంత తర్వాత అ..ఆ సినిమాలో యాక్ట్ చేసింది. వీరిద్దరి తర్వాత ఆ ఛాన్స్ మళ్లీ అను ఇమ్మానుయేల్ కు దక్కనుంది.